8 April, 2026 | 3:06 AM

మొక్కజొన్నల రోడ్డు!

08-04-2026 01:27 AM

కేసముద్రం, విజయక్రాంతి: అదేమిటి.. మొక్కజొన్నల రోడ్డు ఉంటుందా అని అనుకుంటున్నారా.. ! అదేమీ కాదు.. రోడ్డు ఖాళీగా ఉండడంతో మొక్కజొన్నలు పండించిన రైతులు రోడ్డు పొడవునా మొక్కజొన్నలను ఆరబోసుకోవడంతో కేసముద్రం పట్టణ పరిధిలోని ఓ వెంచర్‌లో వేసిన తారు రోడ్డు రైతులకు ఇలా ఉపయోగపడింది.

దారి పొడవునా మొక్కజొన్నలు ఆరబోయడంతో పసుపు వర్ణ శోభితంగా మారింది. మునుపెన్నడూ లేనివిధంగా ఈసారి యాసంగి సీజన్‌లో మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరగడం,దిగుబడి కూడా ఆశించిన మేర రావడంతో రైతులకు పంటనూర్పిడికి సరైన స్థలం లేక ఎక్కడ పడితే అక్కడే మొక్కజొన్నలను ఆరబోసుకుంటున్నారు.