14 July, 2026 | 4:51 AM

వైద్యురాలి ప్రాణాలు కాపాడిన కిమ్స్

14-07-2026 12:00 AM

ఎక్మోతో విజయవంతంగా చికిత్స

హైదరాబాద్, జూలై 13 (విజయక్రాంతి): మహారాష్ట్రలోని షోలాపూర్‌కు చెందిన 32 ఏళ్ల వైద్యురాలు తీవ్రమైన ఇన్‌ఫ్ల్లూయెంజా కారణంగా అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ (ఏఆర్డీఎస్) బారిన పడింది. సికింద్రాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్స్ వైద్యులు అత్యా ధునిక ఎక్మో చికిత్సతో ఆమె ప్రాణాలను కాపాడారు.

కిమ్స్ హాస్పిటల్స్ లీడ్ కన్సల్టెంట్ క్లినికల్ అండ్ ఇంటర్వెన్షనల్ పల్మోనాలజిస్ట్ డా. విశాల్ కుమార్ చిటికేశి తెలిపిన వివరాల ప్రకారం.. షోలాపూర్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో డా. వంశీ కృష్ణ నేతృత్వంలోని కి మ్స్ ఎక్మో బృందం అక్కడికి చేరుకుని ఎక్మో చికిత్స ప్రారంభించింది. అనంతరం ఎక్మో సపోర్టుతోనే రోడ్డు మార్గంలో సురక్షితంగా హైదరాబాద్‌లోని కిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.

సికింద్రాబాద్ కిమ్స్‌లో వారం రోజులపాటు ఎక్మో, వెంటిలేటర్ సాయంతో చికిత్స అందించగా.. డా. ప్రతీక్ ఆధ్వర్యంలోని ఇన్ఫెక్షియస్ డిసీజెస్ విభాగం, పల్మో నాలజీ, క్రిటికల్ కేర్, రెస్పిరేటరీ థెరపీ, నర్సింగ్, ఫిజియోథెరపీ బృందాలు సమన్వయంతో వైద్యం అందించాయి. మొత్తం 25 రోజుల చికిత్స అనంతరం యువ వైద్యురాలు పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. సాధారణ వెంటిలేటర్ చికిత్సకు స్పందించని తీవ్రమైన శ్వాసకోశ వైఫల్య రోగులకు ఎక్మో ప్రాణాలను కాపాడే అత్యాధునిక చికిత్స అని డా. విశాల్ కుమార్ చిటికేశి తెలిపారు. ఇతర రాష్ట్రంలోనే ఎక్మో ప్రారంభించి రోగిని సురక్షితంగా హైదరాబాద్‌కు తరలించడం ద్వారా అత్యవసర వైద్య సేవల్లో కిమ్స్ మరోసారి తన నైపుణ్యాన్ని నిరూపించిందన్నారు. రోగి కుటుంబ సభ్యులు వైద్య బృందానికి కృతజ్ఞతలు తెలిపారు.