India Retail Inflation June 2026: 4.38%కు పెరిగిన ద్రవ్యోల్బణం.. తెలంగాణలోనే అత్యధికంగా 6.36% నమోదు
- మే నెలలో 3.93 % నమోదు
- జూన్ ముగిసే నాటికి 4.38 శాతానికి చేరిక
- రాష్ట్రాల్లో అత్యధికంగా తెలంగాణలో 6.36% నమోదు
India Retail Inflation June 2026 గణాంకాలు ఆందోళన కలిగిస్తున్నాయి. దేశంలో రిటైల్ ద్రవ్యోల్బణం జూన్ నెలలో 4.38 శాతానికి పెరగగా, రాష్ట్రాల వారీగా తెలంగాణ 6.36 శాతంతో మొదటి స్థానంలో నిలిచింది. ఆహార ధరల పెరుగుదల, RBI తదుపరి నిర్ణయాలపై ఈ గణాంకాలు ప్రభావం చూపే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.
India Retail Inflation June 2026 ఎంత నమోదైంది?
India Retail Inflation June 2026 జూన్ నెలలో **4.38%**గా నమోదైంది. మే నెలలో ఇది 3.93% ఉండగా, ఆహార ధరల పెరుగుదల కారణంగా జూన్‌లో పెరిగింది. రాష్ట్రాల వారీగా తెలంగాణ **6.36%**తో అత్యధిక ద్రవ్యోల్బణాన్ని నమోదు చేసింది.
India Retail Inflation June 2026 ఎందుకు పెరిగింది?
న్యూఢిల్లీ, జూలై ౧౩: భారత రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగింది. మే నెలలో 3.93 శాతంగా ఉన్న, ద్రవ్యోల్బణం జూన్ ముగిసే నాటికి 4.38 శాతానికి చేరుకుంది. భారత రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీఐ) 4శాతానికి మించి ద్రవ్యోల్బణం పెరగకూడదని లక్ష్యా న్ని నిర్దేశించుకోగా, ఈ శాతం మించడం గడిచిన ఐదు నెలల్లో ఇదే మొదటిసారి. ఈమేరకు సోమవారం కేంద్ర ప్రభుత్వం అందుకు సంబంధించిన వివరాలను వెల్లడించింది.
ఆహార ద్రవ్యోల్బణం ఎంత పెరిగింది?
ద్రవ్యోల్బణం పెరుగుదలకు ఆహార పదార్థాల ధరలు అమంతంగా పెరగడమే అందుకు ప్రధాన కారణమని ఆర్థిక నిపుణు లు విశ్లేషిస్తున్నారు. మే నెలలో ఇది 4.78 శాతం నమోదైన ఆహార ద్రవ్యోల్బణం, జూన్ నాటికి అది కాస్తా 5.32 శాతానికి చేరుకుంది. అలాగే, ఇదే నెలలో గృహ నిర్మాణ రంగంలో 2.10 శాతం ద్రవ్యోల్బణం, రవా ణా రంగంలో 4.31 శాతం, విద్యారంగ సేవ ల్లో 3.34 శాతం, హోటళ్లు, వసతి సేవల్లో 6.91 శాతం ద్రవ్యోల్బణం నమోదైంది.
తెలంగాణలోనే అత్యధిక ద్రవ్యోల్బణం ఎందుకు నమోదైంది?
రాష్ట్రాల వారీగా తెలంగాణ అత్యధిక రిటైల్ ద్ర వ్యోల్బణాన్ని నమోదు చేసింది. ఈ రాష్ట్రం లో జూన్ నెల ద్రవ్యోల్బణం 6.36 శాతంగా నమోదైంది. అలాగే, ఏపీ 5.39 శాతంతో ఆ తర్వాతి స్థానంలో నిలిచింది. ఢిల్లీలో అత్యల్పంగా 2.96 శాతం నమోదైంది. ద్రవ్యో ల్బణం నియంత్రణలోనే ఉందనే అంచనాతో ఆర్బీఐ ఈ ఏడాది ప్రథమార్ధంలో రె పో రేటును 100 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది. కానీ, తాజాగా మళ్లీ ద్రవ్యోల్బ ణం పెరగడంతో ఆర్బీఐ ఎలాంటి చర్యలకు పూనుకుంటుందోనన్న ఆందోళన నెలకొంది.
India Retail Inflation June 2026
RELATED ARTICLES....
ముడిచమురు ధరల భారీ పతనం: భారత్‌కు భారీ ఊరట… ద్రవ్యోల్బణం తగ్గేనా?
తెలంగాణలో 0.20% తగ్గిన ద్రవ్యోల్బణం
Strait of Hormuz Crisis: ఇరాన్ ఓడరేవులపై అమెరికా ఆంక్షలు.. ట్రంప్ హెచ్చరికలకు ఇరాన్ కౌంటర్ వార్నింగ్






