17 June, 2026 | 8:35 AM

రాష్ట్రపతితో కిషన్‌రెడ్డి భేటీ

15-06-2024 01:30 AM

హైదారాబాద్, జూన్ 14 (విజయక్రాంతి): కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్‌తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. తన సహచర మంత్రి సతీశ్‌చంద్ర దూబెతో కలిసి ఆయన రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతిని కలిశారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి, సతీశ్ చంద్ర దూబెకు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి శుభాకాంక్షలు తెలియచేశారు.