22 August, 2026 | 12:55 PM

మరోసారి మోసపోతే మన తప్పే.. ఆలోచించండి..?: కేటీఆర్

22-05-2024 02:09 PM

హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ మరోసారి సంచలన వ్యాఖ్యాలు చేశారు. తొలి సంతకమే రుణమాఫీపై పెడతానని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని కేటీఆర్ గుర్తుచేశారు. న‌ర్సంపేట‌లో జరిగిన వ‌రంగ‌ల్ – న‌ల్ల‌గొండ – ఖ‌మ్మం ప‌ట్ట‌భ‌ద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్ర‌చార స‌భ‌లో పాల్గొని ఏనుగుల రాకేష్ రెడ్డికి మ‌ద్ద‌తుగా ప్ర‌సంగించారు. డిసెంబర్ 9నే రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశారన్నారు. ఆరు నెలల క్రితం నాటి పరిస్థితి.. ఇప్పటి పరిస్థితి గురించి ఆలోచించండి అని కేటీఆర్ కోరారు. ఆరు నెలలుగా మోసం చేస్తున్న కాంగ్రెస్ గురించి యువత ఆలోచించానని పిలుపునిచ్చారు. మొదటిసారి మోసపోతే వారి తప్పు.. మరోసారి మోసపోతే అది మన తప్పేనని కేటీఆర్ అన్నారు.