వంటింటి చిట్కాలు
12-11-2024 12:00 AM
- ఇడ్లీ పిండి పలుచగా అయినప్పుడు దానిలో చెంచా బ్రెడ్ పొడి, సగం చెంచా మొక్కజొన్న పిండిని నీళ్లలో కలిపి చేర్చితే పిండి గట్టిగా అవడంతో పాటు ఇడ్లీలు మృదువుగా వస్తాయి.
- గారెల పిండి కోసం మినపప్పును నానబెడుతున్నప్పుడు చెంచా పెసరపప్పును కూడా చేర్చండి. గారెలు మెత్తగా, కమ్మగా ఉంటాయి.
- కూరల్లో గ్రేవీ పలచగా అయినప్పుడు కాస్త మొక్కజొన్న పిండి కలిపితే గట్టిపడుతుంది.
- ఆలుగడ్డ పొట్టుతో వెండి పాత్రలుతోమితే కొత్తవాటిలా తళతళలాడతాయి.






