9 July, 2026 | 11:58 PM

కేఎల్ రాహుల్, గోయెంకా వివాదం

10-05-2024 02:11 AM

లక్నో: లక్నో సూప ర్ జెయింట్స్ కెప్టెన్ కేఎల్ రాహుల్, ఆ జట్టు ఓనర్ సంజీవ్ గోయెంకా మధ్య వివాదం చర్చనీయాంశంగా మారింది. బుధవారం సన్‌రైజర్స్‌తో మ్యాచ్ లో 10 వికెట్ల తేడాతో లక్నో దారుణ ఓటమిని చవిచూసింది. లక్నో తొలుత బ్యాటింగ్ చేయ గా.. ఓపెనర్‌గా వచ్చిన రాహుల్  పరిస్థితికి తగ్గట్లు కాస్త నెమ్మదిగా ఆడాడు. మ్యాచ్‌లో రాహుల్ 33 బంతులెదుర్కొని 87 స్ట్రుక్‌రేట్‌తో 29 పరుగులు చేశాడు. అయితే ఛేదనలో రైజర్స్ కేవలం 9.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకోవడం లక్నో జట్టు యజమాని సంజీవ్ గోయెంకాకు చిరాకు తెప్పించింది. మ్యాచ్ ముగిసిన అనంతరం రాహుల్‌ను పిలిపించుకొని అతడికి చివాట్లు పెట్టినట్లు తెలుస్తోంది. గోయెంకా మాట్లాడుతున్నప్పటికి రాహుల్ ఒక్క మాట కూడా జవాబివ్వలేదు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడంటూ సామాజిక మాథ్యమాల్లో వార్తలు వచ్చాయి. ఈ సీజన్‌లో మిగతా రెండు మ్యాచ్‌లకు రాహుల్ స్థానంలో పూరన్ జట్టును నడిపించే అవకాశముందని కొందరు పేర్కొన్నారు. అంతేకాదు ఈ సీజన్ అనంతరం రాహుల్ లక్నోకు గుడ్ బై చెప్పనున్నట్లు సమాచారం.