04-05-2025 07:28:05 PM
కోల్‌కతా: ఐపీఎల్ 2025 సీజన్-18 లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగినా మ్యాచులో రాజస్థాన్ రాయల్స్(Rajasthan Royals)పై కోల్‌కతా నైట్ రైడర్స్(Kolkata Knight Riders) ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. 207 పరుగుల లక్ష్యంతో వచ్చిన రాజస్థాన్ 20 ఓవర్లకు 8 వికెట్లు కొల్పోయి 205 పరుగులు చేసింది. రాజస్థాన్ బ్యాటర్లలో యశస్వి జైస్వల్ (34), రియాన్ పరాగ్ (95), షిమ్రాన్ హెట్మాయర్ (29), శుభమ్ దూబే (25) పరుగులు చేశారు. కోల్‌కతా బౌలర్లలో మోయిన్ ఆలీ, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి తలొ రెండు వికెట్లతో అదరగొట్టారు. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కోల్‌కతా నిర్ణీత 20 ఓవర్లకు 4 నాలుగు వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. కోల్‌కతా బ్యాటర్లలో గుర్బాజ్ (35), నరైన్ (11), కెప్టెన్ అజింక్య రహానే (30), రఘువంశీ (44), చివర్లో ఆండ్రీ రస్సెల్ (57), రింకు సింగ్ (19) పరుగులతో అద్భుతంగా రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో జోఫ్రా ఆర్చర్, యధ్వీర్ సింగ్, తీక్షణ, రియాన్ పరాగ్ చెరొ వికెట్ తీసుకున్నారు.