calender_icon.png 24 May, 2025 | 4:17 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పంజాబ్ కింగ్స్ ఘన విజయం

04-05-2025 11:28:39 PM

పంజాబ్: ఐపీఎల్-2025లో ధర్మశాల వేదికగా జరిగినా మ్యాచులో లక్నో సూపర్ జెయింట్స్(Lucknow Super Giants)పై పంజాబ్ కింగ్స్(Punjab Kings) 37 పరుగుల తేడాతో సునాయాసంగా గెలిచింది. 237 భారీ టార్గెట్ తో వచ్చిన లక్నో... టాప్ ఆర్డర్ త్వరత్వరగా కొల్పోవడంతో 20 ఓవర్లకు 7 వికెట్ల నష్టంతో 199 పరుగులు చేసింది. లక్నో బ్యాటర్లలో ఆయుష్ బడోని (74), అబ్దుల్ సమద్ (45) పరుగులు చేశారు.  

తొలుత టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 236 పరుగుల భారీ స్కోరు చేసింది. ఓపెనర్ ప్రభ్‌సిమ్రన్‌ సింగ్‌ (91), శ్రేయస్ అయ్యర్ (45), జోష్ ఇంగ్లిస్ (30), శశాంక్ సింగ్ (33), స్టాయినిస్ (15), నేహల్ వధేరా (16) బౌండరీలతో విరుచుకుపడ్డారు. లక్నో బౌలర్లలో ఆకాశ్ మహారాజ్ సింగ్ 2, దిగ్వేశ్ సింగ్ రాఠీ 2, ప్రిన్స్ యాదవ్ ఒక వికెట్ పడగొట్టారు.