ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
చిట్యాల, ఏప్రిల్ 20: మండలం అరెగూడెం గ్రామంలో అత్యంత వైభవంగా నిర్వహించిన శ్రీ సీతారామచంద్రస్వామి సహిత శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దేవాలయంలో ధ్వజస్తంభ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గ ప్రజలంతా ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని ప్రార్థించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో దైద రవీందర్ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి,కోమటి రెడ్డి చినవెంకట్ రెడ్డి చిట్యాల మాజీ మున్సిపల్ చైర్మన్, కందమళ్ళ శిశుపాల్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, కంచర్ల వెంకట్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, నాగంపల్లి శ్యామ్ గ్రామ సర్పంచ్, గుడిపాటి లక్ష్మీ నరసింహ,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, జనార్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






