26 March, 2026 | 1:56 PM

Breaking News

ఆస్పత్రిలో ఉన్న సిబ్బంది సున్నా   •   కేంద్ర ప్రభుత్వం తెచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి   •   అంజన్న హుండీ లెక్కింపు ప్రారంభం   •   బీఆర్ఎస్ హయాంలో సీఎం రిలీఫ్ ఫండ్ దుర్వినియోగం.. ఎవరు కాజేశారో తెలుసు!   •   మార్కాపురం బస్సు అగ్నిప్రమాదం — 13 మంది సజీవ దహనం, హెల్ప్‌లైన్ నంబర్లు ఇవే!   •   మార్కాపురం బస్సు దుర్ఘటనపై మోదీ సంతాపం — 14 మంది మృతికి రూ.2 లక్షల పరిహారం!   •   దావోస్ పెట్టుబడులపై అసెంబ్లీలో మంత్రి శ్రీధర్ బాబు సమాధానం   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై స్పందించిన కేంద్రమంత్రులు   •   మార్కాపురం బస్సు ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి   •   కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డాను కలిసిన జాతీయ ఆర్ఎంపీ, పీఎంపీ జేఏసీ నాయకులు   •  

గిట్టని వ్యక్తులు తనపై చేసే తప్పుడు ప్రచారాలు నమ్మవద్దు

18-09-2025 11:16 PM

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి..

చిట్యాల (విజయక్రాంతి): మునుగోడు శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కొందరు గిట్టని వ్యక్తులు సోషల్ మీడియాలో తన ఇమేజ్ తగ్గించే విధంగా ఫేక్ న్యూస్ లు వైరల్ చేస్తున్నారని, వాటిని నమ్మవద్దని గురువారం తెలియజేశారు. గుంటూరులోని ఒక ప్రైవేట్ కార్యక్రమానికి వెళుతూ చిట్యాలలోని ఒక హోటల్లో ఆగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కాలేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని మొదటిసారి గత అసెంబ్లీలో ప్రశ్నించిన వ్యక్తిని తనే అని కానీ సమర్థిస్తున్నట్టు ఫేక్ న్యూస్ పేపర్ లో ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

ఏదో మంత్రి పదవి రాకపోవడం వల్ల ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నట్లు భావించి అబద్దాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని వాటిని తీవ్రంగా ఖండిచారు. కొత్త పార్టీ పెడుతున్నట్టు, పదవికి రాజీనామా చేస్తున్నట్లు పుకార్లు పుట్టిస్తున్నారని, ఎంపీగా, ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొందిన నా కుటుంబమే కాంగ్రెస్ పార్టీ కుటుంబం అని, తెలంగాణ ప్రజలు ఫేక్ న్యూస్ ని నమ్మవద్దని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొన్ని విషయాలు ఇలా చేస్తే బాగుంటది అని కొన్ని వేదికల ద్వారా సలహాలు, సూచనలు చేసానే తప్ప తాను ఎప్పుడు పార్టీకి, ప్రభుత్వం కి వ్యతిరేకంగా మాట్లాడలేదన్నారు. గురువారం గుంటూరులో ఒక ప్రైవేట్ ప్రోగ్రాంకు వెళ్తుంటే అక్కడ ఏదో జగన్ ను కలుస్తానని ఇంకా ఏదేదో ప్రచారాలు చేస్తున్నారని, తప్పుడు ప్రచారాలు నమ్మవద్దని తెలియజేశారు.