19-09-2025 12:00:00 AM
రాజన్న సిరిసిల్ల: సెప్టెంబర్ 18(విజయక్రాంతి): జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తీర్ణత మరింత పెరగాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశించారు. ఇంటర్మీడియట్ విద్య, రానున్న పబ్లిక్ పరీక్షలకు విద్యార్థుల ను సిద్ధం చేయడం, వివిధ అంశాలపై జిల్లాలోని ప్రభుత్వ జూనియర్, సోషల్, బీసీ, ట్రైబల్, మైనార్టీ సంక్షేమ కళాశాలలు, టీజీ రెసిడెన్షియల్, మోడల్ స్కూల్, కేజీబీవీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో గురువారం కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ముందు గా జిల్లాలో ఎన్ని ప్రభుత్వ కళాశాలలు ఉన్నా యి? ఎందరు విద్యార్థులు చదువుతున్నారో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారిని ఆరా తీయగా, మొత్తం 42 ప్రభుత్వ, 06 ప్రైవేట్ జూనియర్ కళాశాలలు ఉన్నాయని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 4302, సెకండ్ ఇయర్ లో 3874 మంది మొత్తం 8176 మంది విద్యార్థులు చదువుతున్నారని కలెక్టర్ దృష్టికి డీఐ ఈఓ తీసుకెళ్లారు.
అనంతరం అన్ని కళాశాలల్లో గత ఏడాది ఎంత మంది విద్యార్థులు పాస్ అయ్యారో.. కళాశాల వారిగా సమీక్షించారు. ఉత్తీర్ణత తక్కువ ఉన్న కళాశాలల ప్రి న్సిపాళ్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.అనంతరం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా మాట్లాడారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కళాశాలల్లో యూ డైస్, ఎఫ్ ఆర్ ఎస్ వచ్చే వారంలోగా పూర్తి చేయాలని ఆదేశించారు.
అన్ని రెసిడెన్షియల్ కళాశాలల్లో ఆవరణ ని త్యం పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని, విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్య మైన భోజనం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, అన్ని సబ్జెక్టులపై పట్టు వచ్చేలా తీర్చిదిద్దాలని, గత ప్రశ్న పత్రాలు తీసుకొని విద్యార్థులతో ప్రాక్టీస్ చేయించాలని, అన్ అకాడమీ తరగతులు సద్వినియోగం చేసుకోవాలని ఆదేశిం చారు.
రానున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తీర్ణత శా తం పెంచేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. జిల్లా ఇంటర్ విద్యాధికారి ప్రతి కళాశాలను తనిఖీ చేయాలని ఆ దేశించారు. అటవీ జంతువులు, కోతులతో ఇబ్బందులు ఎదురవుతున్న విద్యాలయాల బాధ్యులు సోలార్ ఫెన్సింగ్ కోసం జిల్లా ఇం టర్మీడియెట్ విద్యాధికారి దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. అవసరమైన మేర వాటి ని అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి శ్రీనివాస్, ప్రిన్సిపాళ్లు పాల్గొన్నారు.