calender_icon.png 19 September, 2025 | 5:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంపెల్లి కనకేష్ పటేల్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న రైతులకు భోజన వసతి కార్యక్రమం

19-09-2025 12:00:00 AM

పాల్వంచ రైతులకు సరిపడా యూరియా అందించండి. కాంపెల్లి కనకేష్ పటేల్

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి):యూరియా బస్తాల కోసం పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ కార్యాలయం వద్ద ఉదయం నుండి వేచి ఉంటున్న రైతు సోదర, సోదరీమణులకు  బిఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు, పాల్వంచ కో-ఆపరేటివ్ సొసైటీ ఉపాధ్యక్షులు కాంపెల్లి కనకేష్ పటేల్ గత నాలుగు రోజులు గా భోజన సదుపాయం కల్పిస్తున్నారు.

ఈ కార్యక్రమానికి అతిధులుగా లక్ష్మీదేవిపల్లి మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, బిఆర్‌ఎస్వి జిల్లా అధ్యక్షులు సంకుబాపన అనుదీప్, జిల్లా నాయకులు భూక్య చందు నాయక్ లు హాజరయ్యారు.ఈ సందర్భంగా కాంపెల్లి కనకేష్ పటేల్ మాట్లాడుతూ పాల్వంచ మండలంలోని దూర ప్రాంతాల రైతులు యూరియా కోసం ఉదయాన్నే వచ్చి క్యూ లైన్ లో సాయంత్రం వరకు వేచి ఉంటున్నారని అందుకే వారికి గత నాలుగు రోజుల నుండి మధ్యాహ్నం భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నానని, మనకి అన్నం పెట్టే రైతుల కడుపు నింపడం చాలా సంతృప్తిగా ఉన్నదన్నారు.

రైతులు కష్టపడి పంటలు పండిస్తేనే సమాజం లోని ప్రతి ఒక్కరికి అన్నం దొరుకు తుందని, అలాంటి రైతులే పస్తులు ఉండాల్సి వస్తే ఎలా, వారికి సహాయం చేయకుండా ఎలా ఉంటామన్నారు. రాబోయే రోజులలో పాల్వంచ సొసైటీ ఆఫీస్ వద్ద రైతులు భోజనాల కోసం ఇబ్బంది పడితే ఇలాగే భోజన సదుపాయం ఏర్పాటు చేస్తానన్నారు. ఈ కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందన్నారు.

సమాజంలోని సహృదయం గల దాతలు రైతులకు ఏదో ఒక విధంగా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు. పాల్వంచ పట్టణ, మండలంలోని రైతులకు సరిపడా యూరియాని తక్షణమే అందించాలని యూరియా అందక పొలాలు ఎండిపోతున్నాయని రైతులకు ఒక్క బస్తా యూరియా ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదని రైతులకు తగినంత యూరియా ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నానని అన్నారు.

ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవిపల్లి మండల బిఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు కొట్టి వెంకటేశ్వర్లు, బిఆర్‌ఎస్వి  జిల్లా అధ్యక్షులు సంకు బాపన అనుదీప్, జిల్లా నాయకులు భూక్య చందు నాయక్, బిఆర్‌ఎస్ నాయకులు సంగ్లోత్ రంజిత్, మారుమూళ్ల కిరణ్, పూజాల ప్రసాద్, ఆలకుంట శోభన్, గంగాధరి పుల్లయ్య, వల్లపిన్ని వెంకటేశ్వర్లు, పోసారపు అరుణ్, కుమ్మరికుంట్ల వినోద్, కాంపెల్లి నవీన్, కనకరాజు, గజ్జెల రితిక్, కూరెళ్లి మురళి మోహన్, ఆలి,బర్ల క్రాంతి, వంశీ, పిల్లి సాయి, తోట సతీష్ తదితరులు పాల్గొన్నారు.