నాగిరెడ్డిపేట్ మండల ఐకేపీ ఏపీఎంగా ఇంచార్జి బాధ్యతలు చేపట్టిన కొమ్మ దత్తు
నాగిరెడ్డిపేట్, జూన్ 19 (విజయక్రాంతి): నాగిరెడ్డిపేట్ మండల ఐకెపి ఎపిఎంగా ఇన్చార్జి బాధ్యతలు కొమ్మ దత్తు చేపట్టారు. ఇంతకుముందు నాగిరెడ్డిపేట్ మండల ఇన్చార్జి ఏపిఎంగా పనిచేసినటువంటి రామ్ నారాయణ గౌడ్ స్థానంలో ఐకెపి సీసీగా పనిచేస్తున్నటువంటి కొమ్మ దత్తు నాగిరెడ్డిపేట మండల ఇన్చార్జి ఏపీఎంగా బాధ్యతలు ఉన్నత అధికారుల ఆదేశాలతో స్వీకరించడం జరిగింది.
ఈ సందర్భంగా ఆయనతో పాటు పనిచేసిన ఐకెపి సీసీలు, వివోఏలు, కార్యాలయం సిబ్బంది ఘనంగా శాలువతో సన్మానించి మిఠాయి తినిపించి అభినందనలు తెలియజేశారు. దాంతో పాటు ఐకెపిసిసి కొమ్మ దత్తు నాగిరెడ్డిపేట్ మండల ఐకెపి ఎపిఎంగా ఇన్చార్జి బాధ్యతలు స్వీకరించడంతో మండలంలోని పలువురు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల సమైక్య అధ్యక్షురాలు శాంతమ్మ, సీసీలు రమేష్, నారాయణ, రషీద్, రవి, నజీర్, అకౌంటెంట్ రాజు సిబ్బంది పాల్గొన్నారు.






