19 August, 2026 | 3:39 AM

జులై 7 నుంచి బోనాలు షురూ... అధికారులతో కొండా సురేఖ సమీక్ష

15-06-2024 05:32 PM

హైదరాబాద్ : నగరంలో జూలై 7వ తేదీ నుంచి బోనాల ఉత్సవాలు జరుగనున్నాయి. ప్రతి ఏడాది ఆషాడ మాసంలో జరిగే బోనాల ఏర్పాట్లపై జూబ్లీహిల్స్ లోని ఎంసిఆర్ హెచ్ఆర్డిలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఉన్నతాధికారులతో శనివారం సమన్వయ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లోని గోల్కొండ జగదాంబకి గుడిలో మొదలై సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి, లాల్ దర్వాజ సింహ హహిని దేవాలయంలో ఈ బోనాల వేడుకలు ముగుస్తాయి.

ఈ ఆషాడ మాసంలో మహంకాళి అమ్మవారికి ప్రజలు మొక్కులు చెల్లించడం అనవాయతిగా వస్తుంది. 150 ఏళ్ల క్రితం నగరంలో కలరా మహమ్మారి రావడంతో ఈ  బోనాల పండుగను జరుపుకుంటున్నట్లుగా చరిత్ర చెబుతుంది.  ప్రజలు ఈ బోనాల జాతరను ప్రతి ఏడాది అత్యంత వైభవోపేతంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, హైదరాబాద్ ఇంచార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, రాజ్య సభ సభ్యుడు అనిల్ కుమార్, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, జిహెచ్ఎంసి అధికారులు, పోలీస్ అధికారులు పాల్గొన్నారు.