రైతులకు అధికారులు అందుబాటులో ఉండాలి : మంత్రి అచ్చెన్న
15-06-2024 04:53 PM
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తర్వత రాష్ట్ర పాలనపై సర్కార్ దృష్టి సారించింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఉన్నతాధికారులతో శనివారం సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో జూన్ 18వ తేదీన రైతులకు అందించనున్న పీఎం కిసాన్ తదితర అంశాలపై చర్చించారు. ఖరీఫ్ సీజన్ దృష్ట్యా రాష్ట్రంలోని ప్రజలకు విత్తనాలు, ఎరువుల కొరత రాకుండా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ప్రతి అధికారి అందుబాటులో ఉండాలని సూచించారు.






