బీజేపీ కార్యాలయం వద్ద ఉద్రిక్తత
15-06-2024 06:59 PM
హైదరాబాద్ : నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు ఆందోలన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం నాంపల్లిలోని బీజేపీ కార్యాలయం ముందు ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. నీట్ లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఎన్ఎస్ యూఐ కార్యకర్తలు బీజేపీ ఆఫీసు ముదు ధర్నాకు యత్నించారు. దీంతో ఎన్ఎస్ యూఐ కార్యకర్తల ఆందోళనతో బీజేపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ఎస్ యూఐ, బీజేపీ కార్యకర్తలు పరస్పర వ్యతిరేక నినాదాలతో ఆ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పాడింది. దాంతో ఎన్ఎస్ యూఐ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.






