calender_icon.png 16 July, 2025 | 9:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ కార్యదర్శి, సీఎండీఎ శ్రీదేవిని కలిసిన కూన శ్రీశైలం గౌడ్

16-07-2025 12:51:01 AM

కుత్బుల్లాపూర్, జులై 15(విజయ క్రాంతి): తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి, సిఎండిఎ డా.టి.కె. శ్రీదేవిని కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా గత కొన్ని సంవత్సరాల నుండి దుండిగల్ ము న్సిపాలిటీ పరిధిలోని వెనుకబడి ఉన్నటువంటి నాగులూరు,డి పోచంపల్లి, దుండిగల్ గ్రామాలు, అలాగే లంబాడి తండాలలో అభివృద్ధి, డ్రైనేజీ, మౌలిక సదుపాయాలకు నిధులు కేటాయించాలని వినతి పత్రం అందజేశారు.

అనంతరం శ్రీదేవి మాట్లాడుతూ దుం డిగల్ మున్సిపాలిటీ పరిధిలోని గ్రా మాల అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, మాజీ కౌన్సిలర్ రాము గౌడ్, కొంపల్లి మాజీ సర్పంచ్ దేవేందర్, కావలి గణేష్, పాల్గొన్నారు.