16-07-2025 12:49:14 AM
-ఏరియా జీఎం జీ దేవేందర్
మందమర్రి, జూలై 15: సింగరేణి భూగ ర్భ గనులలో విధులు నిర్వహించే కార్మికులు హాజరు శాతాన్ని పెంచి సంస్థ అభివృద్ధికి పాటుపడాలని ఏరియా జిఎం జి దేవేందర్ కోరారు. ఏరియాలోని సిఈఆర్ క్లబ్ లో మంగళవారం కాసిపేట 1, కాసిపేట 2 గను లలో విధులు నిర్వహిస్తూ 100 హాజర్లు పూ ర్తి చేయని కార్మికులకు నిర్వహించిన కుటుం బ సభ్యుల కౌన్సిలింగ్ కార్యక్రమానికి ఆయ న ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం అంద రి అదృష్టమని, యువ కార్మికుల తల్లిదండ్రు లు ఉద్యోగం చేసిన సమయంలో ఉన్న పరి స్థితులు ప్రస్తుతం లేవని, ప్రతి ఒక్క ఉద్యోగి తమ యొక్క హాజరు శాతాన్ని పెంచుకొని సంస్థ అభివృద్ధిలో పాలు పంచుకోవాలని సూచించారు. ఉద్యోగులు ప్రతి నెల 20 హాజర్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్య క్రమంలో ఎస్‌ఓటు జిఎం విజయ్ ప్రసాద్, ఏఐటియుసి బ్రాంచ్ సెక్రటరీ సలేంద్ర సత్యనారాయణ, పర్సనల్ మేనేజర్ ఎస్ శ్యాంసుందర్, సీఎంఓఏఐ ప్రెసిడెంట్ రమేష్, కేకే డిస్పెన్సరీ సూపరింటెండెంట్ నాగేశ్వరరావు, ఏఐటీయూసీ నాయకులు కందుల శ్రీనివాస్, సింగరేణి సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు.