16-07-2025 12:52:42 AM
ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
కాప్రా, జులై 15 (విజయక్రాంతి) : క్రీడాకారులకు అవసరమైన ప్రోత్సా హం, అత్యాధునిక మౌలిక సదుపాయాలను అందించినప్పుడే వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో రా ణించి దేశానికి, ప్రాంతానికి గుర్తింపు తీసుకురాగలరని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం డాక్టర్ ఏఎస్ రావునగర్ డివిజన్ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన ‘విక్టరీ బ్యాడ్మింటన్’ అకాడమీని స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డితో కలిసి లాంఛనంగా ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, ‘యువతలో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీయడానికి, వారికి సరైన మార్గదర్శకత్వం అందించడానికి ఇటువంటి అకాడమీలు ఎంతో అవసరమ నీ, ప్రతిభకు తగిన సదుపాయాలు కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యంమన్నారు. క్రీడాకారులు ప్రాంతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలంటే వారికి అన్ని విధాలుగా ప్రోత్సాహం అవసరమని, ఈ దిశగా ప్రభుత్వం తగిన చర్యలు చేపట్టాలన్నారు.
విక్టరీ బ్యాడ్మింటన్ అకాడమీ యువతకు గొప్ప వేదిక అవుతుందని ఎమ్మెల్యే ఆశాభావం వ్యక్తం చేశారు. అకాడమీ వ్యవస్థాపకులు వెంకట రమణా రెడ్డి, చెక్క ప్రసాద్, కోనేరు భాస్కర్, వాసులను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు.
ఈ కార్యక్రమంలో ఏఎస్ రావునగర్ కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, కాప్రా కార్పొరేటర్ స్వర్ణరాజ్ శివమణి, మాజీ ఎమ్మెల్యే బాల్కా సుమన్, గెల్లు శ్రీనివాస్, కుషాయిగూడ ఏసీపీ వెంకట్ రెడ్డి, సీఐ భాస్కర్ రెడ్డిలతో పాటు పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.