24 August, 2026 | 10:21 PM

Breaking News

మండల స్థాయి ప్రజావాణి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలి   •   ఐటీఐలో ఖాళీ సీట్ల భర్తీకి అవకాశం   •   ఆలేరు జెడ్పీహెచ్‌ఎస్‌ విద్యార్థులకు అన్వర్ స్కాలర్‌షిప్   •   ఒంటరి మహిళల సర్టిఫికెట్లకు తిప్పలు!   •   సంగమేశ్వర స్వామివారిని దర్శించుకున్న ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య   •   గణేష్ మాండపాలకు ఉచిత కరెంటు ఇవ్వాలని వినతి   •   చిరుతపులి చర్మం, గోర్లను అక్రమంగా విక్రయించేందుకు ప్రయత్నించిన నలుగురు వ్యక్తులు అరెస్ట్   •   యంగ్ ఇండియా పాఠశాలను జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేయాలి   •   పోచమ్మ దేవత విగ్రహ ప్రతిష్టకు ఆహ్వానం   •   ప్రభుత్వ ఆసుపత్రి డైట్ క్యాంటీన్ ను తనిఖీ చేసిన ఆహార భద్రతా అధికారి జి వరుణ్ రెడ్డి   •  

గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువు

08-12-2024 11:37 PM

నది ఒడ్డున మరుగుదొడ్లు లేక.. బట్టలు మార్చుకునేందుకు షెడ్లు లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్న మహిళలు

మంథని (విజయక్రాంతి): మంథనిలోని గోదావరి నదిలో పుణ్యస్నానాలకు వచ్చే భక్తులకు కనీస సౌకర్యాలు కరువయ్యాయి. గోదారికి నిత్యం వందలు, వేల సంఖ్యలో స్నానాలకు వచ్చే భక్తులు సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నది ఒడ్డున మరుగుదొడ్లు ఏర్పాటు చేయకపోవడంతో పాటు బట్టలు మార్చుకునేందుకు షెడ్లు లేక మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గోదావరికి మంథని పట్టణంలో నుంచి, మండలంలో నుండే కాకుండా ముత్తారం, రామగిరి, కమాన్ పూర్ మండలాల్లోని ప్రజలు, పెద్దపల్లి జిల్లాలోని తదితర గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల నుంచి కూడా గోదావరి స్నానాలకు మంథనికి వస్తుంటారు. అయినప్పటికీ అధికారులు మరుగుదొడ్లు, బట్టలు మార్చుకునేందుకు షెడ్లు ఏర్పాటు చేయకపోవడంపై మహిళలు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గోదావరి నది ఒడ్డున భక్తుల సౌకర్యార్థం మరుగుదొడ్లు మహిళలు బట్టలు మార్చుకునేందుకు షెడ్లను ఏర్పాటు చేసి భక్తుల కష్టాలు తీర్చాలని భక్తులను కోరుతున్నారు.