09-07-2025 12:00:00 AM
బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్
హైదరాబాద్, జూలై 8 (విజయక్రాంతి): సీఎం రేవంత్‌రెడ్డి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మధ్య రైతుల సమస్యలపై జరుగుతున్న బహిరంగ చర్చ ఒక డ్రామా అని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్వీ సుభాష్ విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలు, ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యా ప్తు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు బీఆర్‌ఎస్ ఇలాం టి డ్రామాలకు పాల్పడుతోందని ఆయన మంగళవారం ఇక ప్రకటనలో ఎద్దేవా చేశారు.
రేవంత్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో ఉన్న సమయంలో కేటీఆర్ బహిరంగ చర్చకు సవాలు విసరడం చూస్తే బీఆర్‌ఎస్ పార్టీ తీరేంటో అర్థమవుతుంద న్నారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్ పార్టీలకు రైతుల సమస్యలే పట్ట డం లేదని విమర్శించారు. రైతులపై ప్రేమ ఉంటే ప్రెస్‌క్లబ్ లో కాకుండా అసెంబ్లీలో చర్చించాలని డిమాండ్ చేశారు.
బీఆర్‌ఎస్ పాలనలో రూ.4 లక్షల కోట్ల అప్పుంటే ఈ సర్కా రు వారిని మించిపోయేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రాష్ర్టంలో నెలకొన్న సమస్యలపై చర్చించడానికి అ త్యవసర అసెంబ్లీ సమావేశం నిర్వహించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత సర్కారు కూడా అసెంబ్లీ సమావేశాలను కొన్ని రోజుల్లోనే ముగించాలని చూస్తోందన్నారు.