2 July, 2026 | 4:22 PM

Breaking News

ముఖ్యమంత్రి పర్యటనలో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్లక్ష్యంపై చర్యలు తీసుకోవాలి   •   జిల్లాలో వైద్య ఆరోగ్య సేవలు మెరుగుపర్చాలి   •   బోథ్ పంచాయతీ ఈవోగా అశోక్ కుమార్   •   యూరియా పక్కదారి పట్టించిన డీలర్ అరెస్ట్, ఏఓ పై వేటు   •   పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ   •   దశలవారీగా గ్రామాల అభివృద్ధి.. కోటి 50 లక్షలతో నిర్మించిన బ్రిడ్జి ప్రారంభం   •   ఆర్యవైశ్య పొలిటికల్ కమిటీ వైస్ చైర్మన్ తాడికొండ సీతయ్య   •   ప్రతి విద్యార్థి ఆరోగ్యం పట్ల శ్రద్ధ చూపాలి   •   తెలంగాణభవన్‌లో మంత్రి జూపల్లి కోసం కుర్చీ   •  

మీరూ మీరూ కలిస్తే మాకేం లాభం..

01-09-2024 12:24 AM

రాజకీయంగా చిత్ర,విచిత్రమైన వ్యా ఖ్యలకు ప్రస్తుతం తెలంగాణే కేంద్ర బిం దువుగా మారింది. దీనికి ప్రధాన కార ణం.. రాష్ట్రంలోని మూడు ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ నాయ కులు ఆయా పార్టీలపై చేసే విమర్శలే. ప్రస్తుతం రాష్ట్ర రాజకీయమంతా కవిత బెయిల్ చుట్టే తిరుగుతోంది. అయితే కవితకు బెయిల్ రావడం వెనుక బీఆర్‌ఎస్, బీజేపీ కలయిక ఉందని కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. బీజేపీలో బీఆర్‌ఎస్ విలీనం ప్రక్రియలో భాగంగానే కవితకు బెయిల్ మంజూరైందని ఆరోపిస్తున్నారు. ఇక పోతే బీజేపీ నాయకులు తీరు మరో లా ఉంది. లిక్కర్ కేసులో కవిత తరపున వాదించినందుకే అభిషేక్ మను సింఘ్వీని రాజ్యసభ సీటు వరించిందని బీజేపీ నేతలు చెబుతున్నారు.

లేకపోతే 38 మంది ఎమ్మెల్యేల బలమున్న బీఆర్‌ఎస్ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేదని ప్రశ్నిస్తున్నారు. దీంతో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ లోపాయికారి ఒప్పందం బయటపడిందంటున్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసే కేసీఆర్‌ను దెబ్బతీయాలనే కుట్రలు చేస్తున్నాయని బీఆర్‌ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. బీఆర్‌ఎస్ పార్టీని బలహీనం చేయడమే రాష్ట్రం, కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్, బీజేపీల లక్ష్యమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ మొత్తం సీన్ చూస్తున్న ప్రజ లు మాత్రం అవాక్కవుతున్నారు. అసలు ఎవరు ఎవరితో కలుస్తున్నారో అర్థం కావడం లేదని అభిప్రాయపడుతున్నారు. అయినా మీరూ మీరూ కలిస్తే మాకేంటి లాభం అనుకుంటున్నారు. మీరు చేసే వ్యాఖ్యల వల్ల గానీ, మీ లోపాయికారి ఒప్పందాల వల్లగానీ, మీ విలీన ప్రక్రియ వల్లగానీ రాష్ట్రానికి జరిగే మేలెంటో చెప్పాలని ఆయా పార్టీల నాయకులను ప్రశ్నిస్తున్నారు.