23-10-2025 12:37:43 PM
హైదరాబాద్: అధికారులను వేధించడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) అన్నారు. మంత్రి జూపల్లి వేధింపుల వల్లే ఐఏఎస్ అధికారి రిజ్వీ వీఆర్ఎస్(Senior IAS officer SAM Rizvi) తీసుకున్నారని స్పష్టం చేశారు. మంత్రుల విభేదాల మధ్య అధికారులు నలిగిపోతున్నారని కేటీఆర్ సూచించారు. మిగిలిన అధికారులు కూడా జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ కోరారు.
మంత్రుల ఒత్తిడికి తలొగ్గి అధికారులు తప్పులు చేస్తే తర్వాత మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. అవినీతికి పాల్పడిన ఒక ఓఎస్ డీని స్వయంగా మంత్రి తన కారులో తీసుకెళ్లి రక్షించారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) నివాసం సెటిల్ మెంట్లకు అడ్డాగా మారిందని కేటీఆర్ ఆరోపించారు. నీకింత.. నాకింత అనే సెటిల్ మెంట్లు తప్ప.. రాష్ట్రంలో పాలన లేదని మాజీ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పారిశ్రామికవేత్తను తుపాకీతో బెదిరించినట్లు స్పష్టంగా తెలుస్తోందని ఆయన వెల్లడించారు.తుపాకీతో బెదిరించిన మాట వాస్తవమని మంత్రి కూతురు స్వయంగా చెప్పారని తెలిపారు.