23-10-2025 12:40:23 PM
చిట్యాల,(విజయక్రాంతి): విదేశీ పర్యటన ను దిగ్విజయంగా ముగించుకుని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutha Sukender Reddy ) దంపతులకు శంషాబాద్ ఎయిర్ ఫోర్ట్ లో చిట్యాల మండలం ఉరుమడ్ల గ్రామానికి చెందిన నాయకులు స్వదేశీ ఆగమన శుభాకాంక్షలు తెలియజేసి ఘనస్వాగతం పలికారు. చిట్యాల మార్కెట్ డైరెక్టర్ కోనేటి యాదగిరి, వనమా వెంకటేశ్వర్లు, గ్రామ శాఖ అధ్యక్షుడు చెరుకు సైదులు, మాజీ ఉప సర్పంచ్ ఉయ్యాల లింగయ్య, జనపాల శ్రీను, బోయ స్వామి, మర్రి రమేష్,తేరట్ పల్లి హనుమంత్, పాటి మాధవరెడ్డి, శంకరయ్య, గుండె రవి తదితరులు పాల్గొన్నారు.