calender_icon.png 26 July, 2025 | 12:03 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్ద అతిపెద్ద మోసం

25-07-2025 06:31:34 PM

రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళ్తున్నాయి

దళిత డిక్లరేషన్ లో ప్రకటించింది ఏది చేయలేదు

దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దించేదాకా పోరాడుదాం

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

ఎల్లారెడ్డి,(విజయక్రాంతి): కాంగ్రెస్ మేనిఫెస్టో చూస్తుంటే ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అని తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారక రామారావు అన్నారు. శుక్రవారం కామారెడ్డి జిల్లా లింగంపేట మండల కేంద్రంలో నిర్వహించిన ఆత్మ గౌరవ గర్జన సభ సాక్షిగా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని, రాహుల్ గాంధీ ల తీరుపై కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలపై మాట్లాడారు. లింగంపేటలో అంబేద్కర్ జయంతి రోజు తమ నాయకుడు సాయిలు కు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని సవాల్ విసిరారు. బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఘనంగా గౌరవించిన సీఎం కేసీఆర్ ఒక్కరే అని అన్నారు. దళితులకు దళిత బంధు, మూడు ఎకరాల భూ పంపిణీ  చేసిన ఘనత కేసీఆర్ దే నని అన్నారు. అంబేద్కర్ అతిపెద్ద విగ్రహం దేశంలో ఎక్కడ ఏర్పాటు కాలేదని హైదరాబాదులో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

తెలంగాణ సాధనకు రాజ్యాంగం దిక్సూచి కావడంతో కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టి గౌరవించుకున్నామని గుర్తు చేశారు. ఇక్కడి రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రాహుల్ గాంధీ ఖాతాలకు వెళ్తున్నాయని ఆరోపించారు. టిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు క రోనా వ్యాధి మహమ్మారి వచ్చినప్పటికీ కెసిఆర్ రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత డిక్లరేషన్ లో ప్రకటించింది ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడుదాం అని పిలుపునిచ్చారు. అంతకుముందు కామారెడ్డి మాజీ ఎమ్మెల్యే మాజీ ప్రభుత్వ వీప్ గంప గోవర్ధన్ ఆధ్వర్యంలో కామరెడ్డి మండలం నరసన్న పల్లి శివారులోని 44 వ జాతీయ రహదారి వద్ద స్వాగతం పలికారు. అనంతరం బైక్ ర్యాలీతో కామారెడ్డి నుంచి లింగంపేట వరకు స్వాగతం పలికారు. ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే  జాజాల సురేందర్ ఆధ్వర్యంలో కేటీఆర్ కు ఘన స్వాగతం పలికారు. లింగంపేట మాజీ ఎంపీపీ  ముదాం సాయిలు ను పరామర్శించారు. దళితుల వ్యతిరేక ప్రభుత్వం కాంగ్రెస్ అని అన్నారు.

ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నెరవేర్చ లేదన్నారు. దళిత బంధు కొనసాగిస్తామని చెప్పిన ప్రభుత్వం దళిత కుటుంబాలకు 12 లక్షల ఇస్తామని ఇచ్చారా అని ప్రశ్నించారు. మీరు ఏ ఎక్కడ కూర్చుండుమంటే  ఆడ కుసుంటాను అన్న తీరుగా కాంగ్రెస్ ప్రభుత్వం తీరు ఉందని మాకేం నష్టం లేదు, బాదాలేదు అన్నట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతినిధులు వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు  ఆతిపెద్ద మోసం అనే దుయ్యబట్టారు. ఆరు గ్యారంటీలు అమలు అవుతున్నాయా అని కేటీఆర్  సభ సాక్షిగా ప్రజలను  ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతుబంధు హామీలను తుంగ లో తొక్కి ఏగ  నామం పెట్టారని అన్నారు. కెసిఆర్ మళ్లీ సీఎం అవు తేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని  అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అరకొరగా రైతు సంబరాలు చేసుకోమన్నారని ఆరోపించారు.

ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళ్తున్నాయని ఆరోపించారు. సీఎం రేవంత్ రెడ్డి ఆడబిడ్డలను, పిల్లలను మోసం చేస్తున్నారని అన్నారు. వసతి గృహాల్లోని పిల్లలకు సరిగా తిండి పెట్టలేని పరిస్థితి ఉందని అన్నారు. తులం బంగారం ఇచ్చారా ,ఆసరా పెన్షన్ ఇవ్వకుండా మోసం చేశారని ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలను రేవంత్ రెడ్డి ఇచ్చానని చెప్పుకుంటున్నారని ఆరోపించారు. సర్కారు నడిపేటోనికి దమ్ముంటే ఆదాయం పుడుతుంది, పనులు కూడా అవుతాయి,  అని అన్నారు .గురుకులాల్లో విషం పెడుతున్నారని, వందల మంది పిల్లల ప్రాణాలు తీర్చారని ఆరోపించారు. 6.50 లక్షల మంది పిల్లలకు నాణ్యమైన భోజనం అందడం లేదన్నారు ప్రపంచ సుంద రాంగులకు లక్ష రూపాయల ప్లేటు భోజనం పెట్టారు అని విమర్శించారు.