25-07-2025 06:27:46 PM
రెండు ధపాలు నందిపాడు సర్పంచ్
అశ్వారావుపేట,(విజయక్రాంతి): సీపీఐ(ఎం) సీనియర్ నాయకుడు, రెండు దఫాలుగా సర్పంచ్ గా పని చేసిన ఊకె వీరాస్వామి(84) శుక్రవారం వయోభారం తో మృతి చెందారు. అశ్వారావుపేట మండలం నందిపాడు గ్రామ పంచాయతీ సర్పంచ్ గా రెండు దఫాలు పని చేశారు. ఊకె భౌతిక కాయాన్ని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి మచ్చా వెంకటేశ్వర్లు,రాష్ట్ర కమిటీ సభ్యులు అన్నవరం కనకయ్యలు సందర్శించి నివాళులు అర్పించారు. వీరాస్వామి భౌతికకాయంపై పార్టీ పతాకాన్ని ఉంచి జోహార్లు అర్పించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కొక్కెరపాటి పుల్లయ్య,అన్నవరం సత్యనారాయణ,రేపాకుల శ్రీనివాసరావు,జిల్లా కమిటీ సభ్యులు అర్జున్,చిరంజీవి లు నివాళులు అర్పించారు. వీరాస్వామి కి భార్య బుల్లెమ్మ,ఇరువురు కుమారులు,ఒక కుమార్తె ఉన్నారు.