calender_icon.png 26 July, 2025 | 12:22 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

టర్మినేటెడ్ జేఎంఈటీల...

25-07-2025 06:35:19 PM

పునర్నియామకానికి సింగరేణి అంగీకారం

గుర్తింపు సంఘానికి, యాజమాన్యానికి మధ్య కుదిరిన ఒప్పందం

మంచిర్యాల,(విజయక్రాంతి): సింగరేణి సంస్థలో జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీ (జేఎంఈటీ)లుగా చేరి వివిధ కారణాలతో టర్మినేట్ అయిన 43 మంది ఉద్యోగులను తిరిగి విధుల్లోకి తీసుకోవడానికి సింగరేణి యాజమాన్యం సూత్రప్రాయంగా అంగీకరించింది. గురు వారం రాత్రి హైదరాబాద్ లోని డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ కార్యాలయంలో గుర్తింపు కార్మిక సంఘమయిన సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ), సింగరేణి యాజమాన్యంతో చర్చలు జరిపారు. గతంలో జేఎంఈటీలు వివిధ కారణాల చేత విధులకు గైర్హాజరు కావడం, అవసరమైన ధ్రువపత్రాలను సమర్పించకపోవడం వల్ల విధుల నుంచి తొలగించడం జరిగిందనీ, మానవతా దృక్పథంతో వ్యవహరించి తిరిగి ఉద్యోగాలు కల్పించాలని ఏఐటీయూసీ నాయకులు 2024, నవంబర్ లో జరిగిన డైరెక్టర్(పా) స్థాయి నిర్మాణాత్మక సమావేశంలో ఆ తర్వాత ఈ ఏడాది మార్చిలో ఛైర్మన్ స్థాయిలో జరిగిన నిర్మాణాత్మక సమావేశంలోనూ అజెండా అంశంగా చేర్చి చర్చించామని, గత నెల 27న డైరెక్టర్ (పా) స్థాయిలో జరిగిన 51వ నిర్మాణాత్మక సమావేశంలో చర్చించి ఒక  ద్వైపాక్షిక అంగీకారానికి వచ్చామన్నారు. ఆ తర్వాత యూనియన్ ప్రతినిధులు, డిప్యూటీ చీఫ్ లేబర్ కమిషనర్ సమక్షంలో మరోమారు చర్చల అనంతరం త్రైపాక్షిక ఒప్పందానికి అంగీకారం కుదిరిందనీ ఏ ఐ టీ యూ సి నాయకులు వెల్లడించారు.

ఒప్పంద విషయాలు...

- టర్మినేట్ అయి పునర్ నియామకం పొందుతున్న 43 మంది జూనియర్ మైనింగ్ ఇంజినీర్ ట్రైనీలను తాజా నియామకంగా గుర్తించడం.

- వీరంతా సంస్థ ఏర్పాటు చేసే హై పవర్ కమిటీ ముందుకు వెళ్లి తమ సర్వీసు విషయాలు, ఓవర్ మెన్ సర్టిఫికెట్, గ్యాస్ టెస్టింగ్ ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్లు మొదలైనవి సమర్పించవలసి ఉంటుంది. అనంతరం ఆ కమిటీ సూచన మేరకు మెడికల్ ఫిట్ నెస్ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. దాని ఆధారంగా ప్రాథమిక అపాయింట్మెంట్ ఆర్డర్లు జారీ చేస్తారు.

- తిరిగి ఉద్యోగంలో చేరిన వీరు తమ మొదటి సంవత్సరంలో తప్పనిసరిగా కనీసం 190  మస్టర్లకు తగ్గకుండా విధులు నిర్వహించాలి.