24 May, 2026 | 10:25 PM

సీఎం వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన కేటీఆర్

20-08-2024 02:48 PM

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ ఘాటుగా స్పందించారు. చీఫ్ మినిస్టర్ రేవంత్ నా మాటలు గుర్తుంచుకోండని ఎక్స్ లో కేటీఆర్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన రోజే అంబేద్కర్ విగ్రవం వద్ద చెత్త తొలగిస్తాం, బీఆర్ఎస్ రాగానే సచివాలయం పరిసరాల్లో చెత్త తొలగిస్తామని పేర్కొన్నారు. ఢిల్లీ గులాంలు రాష్ట్ర ఆత్మగౌరవం అర్థం చేసుకుంటారని ఆశించలేమని తెలిపారు. చిన్న పిల్లల ముందు చెత్త మాటలు మాట్లాడిన రేవంత్ రెడ్డి నైజం, వ్యక్తిత్వం ఆయన పెంపకాన్ని సూచిస్తోందని ఆరోపించారు. మానసిక రుగ్మత నుంచి రేవంత్ రెడ్డి త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.