calender_icon.png 10 May, 2025 | 10:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వందల మందిని అరెస్టు.. రణరంగంగా మార్చిన ఓయూ : కేటీఆర్

09-07-2024 05:53:23 PM

హైదరాబాద్ : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నలు సంధించారు. 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ అన్నారు.. ఏమైంది? అని ప్రశ్నించారు. రాష్ట్రంలోని డీఎస్సీ అభ్యుర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

వందల మందిని అరెస్టు చేసి అక్రమ కేసులు పెడుతూ.. ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని రణరంగంగా మార్చారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. డిఎస్సీ ప్రిపరేషన్ కు సమయం లేకుండా అభ్యర్థులతో ఆడుకుంటున్నారు. డీఎస్సీ వాయిదా వేయాలని అభ్యర్థులు కోరుతుంటే ఎందుకీ మొండివైఖరి చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకు సీఎం అపాయింట్ మెంట్ ఎందుకు ఇవ్వడం లేదని కేటీఆర్ తెలిపారు.