19-06-2025 12:13:00 AM
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో శేఖర్ కమ్ముల తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘కుబేర’. సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్‌మోహన్‌రావు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రం జూన్ 20న విడుదల కానుంది.
ఈ సందర్భంగా డైరెక్టర్ శేఖర్ కమ్ముల సినిమా విశేషాలను విలేకరులతో పంచుకున్నారు.
--‘కుబేర’ తీయడానికి -మోటివేషన్ అంటూ ఏం లేదు. కానీ ఇదొక ఇంట్రెస్టింగ్ లైన్ అనిపించింది. ఒక సూపర్ రిచ్ ప్రపంచం, ఇంకొకటి అట్టడుగున ఉండే ప్రపంచం. నిజానికి ఇది కథగా చెప్పడం చాలా కష్టం. చాలా పెద్ద పాయింట్. మెల్లగా ఇవాల్వ్ అయితే ఒక ఎమోషనల్ థ్రిల్లర్ తయారయింది. ఈ కథ నేను చెప్పడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కథ కచ్చితంగా చెప్పబడాలి. ఈ కథ అందరిలో ఒక అవగాహన తెస్తుంది.
--కొన్ని షేడ్స్ ఉన్న క్యారెక్టర్స్ నాగార్జున చేస్తే బాగుంటుంది. ఈ క్యారెక్టర్‌కు ఆయన పర్ఫెక్ట్ యాప్ట్. ఈ సినిమాలో ఆయన చాలా కొత్తగా కనిపిస్తారు. క్యారెక్టర్‌లోకి అద్భుతంగా ఇమిడిపోయారు. -రష్మిక అవకాశం వస్తే నెక్స్ లెవెల్‌లో నటించే హీరోయిన్ తను. ధనుష్ క్యారెక్టర్‌ను ఆయన తప్పితే ఎవరూ చేయలేరు. ఆయన విషయంలో అవుట్ స్టాండింగ్ పర్ఫామెన్స్ అనేది చిన్న మాట. ఆ క్యారెక్టర్‌లో ఇంకా ఎవరినీ ఊహించలేరు. సినిమా పూర్తయ్యేవరకూ ధనుష్ ఆ క్యారెక్టర్‌లోనే ఉంటారు. ఏదైనా సింగిల్ టేక్‌లో చేసేస్తారు. జిమ్‌షర్బ్ నన్ను చాలా సర్ర్పైజ్ చేశారు. ఎంత పెద్ద డైలాగ్ అయినా నేర్చుకునేవారు. చాలా పర్ఫెక్ట్‌గా ఒక లైన్ మిస్ కాకుండా చెప్పేవారు. ఈ సినిమా తర్వాత ఆయనకు ఇక్కడ మరిన్ని అవకాశాలు వస్తాయి.
--నిజానికి నేను ఒక మార్కు కోసం ఎప్పుడూ సినిమాలు చేయలేదు. అయితే ఎక్కువగా బ్లాక్‌బస్టర్ ఆయన సినిమాలు మ్యూజికల్ హిట్స్, లవ్‌స్టోరీలు కాబట్టి అలా నాపై ఒక ముద్ర పడింది. ‘-లీడర్’ నిజాయితీగా చెప్పిన కథ. అందులో లవ్‌స్టోరీ పెట్టాలి.. మంచి పాటలు పెట్టాలని అనుకోలేదు. ‘హ్యాపీడేస్’ అంతే.. కాలేజ్ స్టోరీ. అలాగే ట్రీట్ చేశాను. అందుకే అందరికీ నచ్చింది. ‘కుబేర’ కథకూ కావలసిందే చేశాను. మార్క్ అనేది కథ ప్రకారం ఉంటుంది. అయితే ఇలాంటి కథను ఇలా చేశారా అనే వావ్ ఫ్యాక్టర్ ప్రేక్షకులకు అనిపిస్తుంది. నేను ఏ సినిమా తీసినా హానెస్ట్‌గానే చేస్తాను. అది ఈ సినిమాలో పదింతలు కనిపిస్తుంది. ఇది ఐడియాలాజికల్ బాటిల్ ఉండే సినిమా కాదు. అయితే సినిమా చూస్తున్నప్పుడు ఇలాంటి రెండు ప్రపంచాలు ఉన్నాయనేది అవగాహనైతే వస్తుంది.
- కథే ముంబయి బ్యాక్‌డ్రాప్‌ను కోరుకుంది. కథపరంగా ముంబై తప్పనిసరి. -అక్కడ షూట్ చాలా డిఫికల్ట్. పర్మిషన్స్ రావు. చాలా కండిషన్స్ ఉంటాయి. ముంబై వాళ్లే వేరే చోట షూట్ చేసుకుంటున్నారు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ షూట్ చాలా చాలెంజింగ్‌గా అనిపించింది.
- నా 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని చూసుకున్నప్పుడు.. ఎక్కడో ఒక చిన్న ఇంట్లో ఫస్ట్ సినిమా.. ఇప్పుడు ఇంత పెద్ద సినిమా. ఎమోషనల్‌గా అనిపిస్తుంది. -ప్రేక్షకులు నాపై ఎప్పుడూ ఒక నమ్మకాన్ని ఉంచారు. దాన్ని నేను నిలబెట్టుకున్నాను. అది చాలా ఆనందాన్నిచ్చే విషయం. ప్రేక్షకులు నాకొక స్థాయిని ఇచ్చారు. అంతకంటే నేను ఏం కోరుకోను.
- కుబేరకు పార్ట్ 2 ఉండదు. ఇక్కడితో అయిపోతుంది. నేను ఒక్కటి తీసినప్పటికే సరిపోతుంది (నవ్వుతూ). లీడర్‌కు సీక్వల్ గురించి ఆలోచిస్తూ ఉంటాను. కథ నాకు క్లారిటీ ఉంది. కానీ లీడర్ తీసినప్పటికీ.. ఇప్పటికీ పరిస్థితులన్నీ చాలా మారిపోయాయి. దేశం, ప్రజల్లో చాలా మార్పులు వచ్చేశాయి. థింకింగ్ మారిపోయింది. దాన్ని సరిగ్గా పట్టుకోవాలి.