calender_icon.png 30 May, 2025 | 4:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కుమారి మరణం ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటు..

28-05-2025 06:52:06 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాలలో ములకలపల్లి కుమారి మరణం ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరంలోటు అని కాంగ్రెస్ పార్టీ కోదాడ నియోజకవర్గ నాయకులు పందిరి నాగిరెడ్డి(Constituency leaders Pandiri Nagireddy) అన్నారు. బుధవారం మండల పరిధిలోని కొక్కిరేణి గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ములకలపల్లి రాములును ఆయన పరామర్శించారు.

ఈ సందర్భంగా ములకలపల్లి కుమారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు మేదరమెట్ల వెంకటేశ్వరరావు, వట్టెపు సైదులు, మిట్ట గనుపుల ముత్యాలు, దేవరం వెంకటరెడ్డి, దుగ్గి బ్రహ్మం, ఎమ్మెస్ విద్యాసంస్థల సీఈవో టేకు శ్రీనివాసరావు, సామాజిక కార్యకర్త గంధం సైదులు, తిమ్మారెడ్డి గూడెం గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు తిమ్మారెడ్డి వీర రాఘవరెడ్డి, పోటు దుర్గారావు, కేతిరెడ్డి సత్యనారాయణరెడ్డి, తిరుమలగిరి మాజీ ఎంపీపీ జెర్రిపోతుల యాదగిరి శోభారాణి, సిపిఎం హుజూర్ నగర్ పోసనబోయిన హుస్సేన్, సీనియర్ నాయకులు ములకలపల్లి సీతయ్య,మండల కార్యదర్శి సిపిఎం గ్రామ కార్యదర్శి నందిగామ సైదులు, సింగిల్ విండో డైరెక్టర్ నీరుకొండ శంబయ్య తదితరులు పాల్గొన్నారు.