28-05-2025 06:55:48 PM
మహబూబాబాద్ (విజయక్రాంతి): ఆపరేషన్ కగార్(Operation Kagar)కు వ్యతిరేకంగా మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో అమరవీరుల స్థూపం వద్ద వివిధ ప్రజా సంఘాల నాయకులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని, ఎన్‌కౌంటర్ ఘటనలపై న్యాయ విచారణ నిర్వహించాలన్నారు. ఎన్‌కౌంటర్‌లో మరణించిన మావోయిస్టుల మృతదేహాలను బంధువులకు అప్పగించకుండా పోలీసులే దహనం చేయడం సహించరాని విషయమన్నారు.
ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం లక్ష్మణ్, తెలంగాణ ప్రజా ఫ్రంట్ నాయకులు రమాదేవి, సంజీవ, నాగభూషణం, అఖిల భారత రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి గౌని ఐలయ్య, మాస్ లైన్ సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యదర్శి చిన్న చంద్రన్న, వివిధ ప్రజాసంఘాల నాయకులు వట్టం ఉపేందర్, హరినాయక్, బోడ లక్ష్మణ్, గూగులోత్ భీమా నాయక్, జిల్లా నాయకులు లింగన్న, అశోక్, గీత, గుజ్జు దేవేందర్, సామ పాపయ్య, బట్టు చైతన్య తదితరులు పాల్గొన్నారు.