18 June, 2026 | 7:16 PM

నూతన సీఐ ఎల్లయ్యకు కుమ్మరి శాలివాహన సంఘం ఘన సత్కారం

18-06-2026 05:26 PM

అశ్వాపురం, జూన్ 18 (విజయక్రాంతి): అశ్వాపురం పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్‌గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిలివేరు ఎల్లయ్యను మండల కుమ్మరి శాలివాహన సంఘం ఆధ్వర్యంలో  గురువారం ఘనంగా సన్మానించి మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులు సీఐ ఎల్లయ్యకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. సంఘం నాయకులు మాట్లాడుతూ అశ్వాపురం మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యతనిస్తూ ప్రజలకు స్నేహపూర్వక పోలీసు సేవలు అందించాలని, ప్రజల విశ్వాసాన్ని చూరగొనే విధంగా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు.

సన్మానానికి స్పందించిన సీఐ సిలివేరు ఎల్లయ్య మాట్లాడుతూ తనపై చూపిన ఆదరణకు కుమ్మరి శాలివాహన సంఘం సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రజల సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కట్టుబడి పనిచేస్తానని, ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంటూ మెరుగైన పోలీసు సేవలు అందించేందుకు కృషి చేస్తానని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల కుమ్మరి శాలివాహన సంఘం అధ్యక్షుడు కొత్తపల్లి సత్యనారాయణ, ఉపాధ్యక్షుడు గంగాధర కృష్ణ, ప్రధాన కార్యదర్శి బొడ్డుపల్లి రాము, నాగారపు నాగరాజు, సిలివేరి చంద్రరావు, సిలివేరి వెంకన్న, మాడుగుల వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.