18 June, 2026 | 7:20 PM

ఖానాపూర్ గోదావరి తీరంలో శాశ్వత ఏర్పాట్లు

18-06-2026 05:27 PM

ఖానాపూర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, కౌన్సిలర్ గుమ్ముల ఆనంద్ కుమార్

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ గోదావరి నది తీరంలో శాశ్వత ఏర్పాట్లు చేసేందుకు కృషి చేస్తున్నామని ఖానాపూర్ బిజెపి అసెంబ్లీ కన్వీనర్ అంకం మహేందర్, నాల్గవ వార్డు కౌన్సిలర్ గుమ్ముల ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా గురువారం గోదావరి నది తీరా ప్రాంతంలో ఉన్న స్మశాన వాటిక, ఇతర పరిసరాలను పరిశీలించారు. గోదావరి నది తీరంలో ప్రజలు, వృద్ధులు స్నానం చేయడానికి శాశ్వతంగా షవర్లు ఏర్పాటు చేస్తామని, దాంతోపాటు ఇటీవల ఈదురు గాలులకు పడిపోయిన విద్యుత్ స్తంభాల స్థానంలో నూతన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి రాత్రివేళ స్మశాన వాటిక వద్ద అంత్యక్రియలు చేయడానికి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వారు అన్నారు. వారితో పాటు కాలనీవాసులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు ఉన్నారు.