13 May, 2026 | 11:48 PM

Breaking News

మల్లెపల్లి వడ్ల కేంద్రంలో భారీ కుంభకోణంలో సీబీసీఐడీ విచారణ చేపట్టాలి   •   బక్రీద్ కు ప్రత్యేక చర్యలు చేపట్టాలి   •   బోధన్ పట్టణంలో గంజాయి నేరస్తుడు పట్టివేత   •   గ్రామీణ రహదారుల నిర్మాణంతోనే నిజమైన అభివృద్ధి సాధ్యం: కూనంనేని   •   ఆత్మకూరులో ఘనంగా శ్రీమరకత ఆత్మలింగేశ్వర స్వామి దివ్య ప్రతిష్ట మహోత్సవం   •   గ్రామాల్లో మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం   •   తూప్రాన్ టోల్ ప్లాజా వద్ద తనిఖీలు చేసిన జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు   •   సుల్తానాబాద్ కోర్టుకు హాజరైన బిజెపి నాయకులు   •   భూలక్ష్మి మహాలక్ష్మి అమ్మవార్ల ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో జీవించాలి   •   ప్రేమ పేరుతో యువతిని నమ్మించి మోసం చేసిన యువకుడు   •  

కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలకు సిబ్బంది లేక ఇబ్బంది

24-03-2025 01:05 AM

మోతే, మార్చి23:-  రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన రాజీవ్ వికాస్ పథకం కోసం దరఖాస్తులు చేసుకోవడానికి మీసేవ కేంద్రాల్లో అప్లై చేసుకున్న వాళ్లు కుల, ఆదా య ధ్రువీకరణ కోసం దరఖాస్తులు చేసుకొని రోజులు గడుస్తున్న మోతే తహసిల్దార్ కార్యాలయంలో సిబ్బంది లేక ఇబ్బందులు పడుతున్నారు.

ఆర్ ఐ లు లేకపోవడంతో ఇంచార్జ్ తహసీల్దార్ శ్రీకాంత్ స్వయంగా గ్రామాల్లోకి వెళ్లి విచారణ చేయవలసిన పరిస్థితి సూర్యాపేట జిల్లా మోతే మండలంలో నెలకొన్నది. రికార్డులు ట్యాంపరింగ్ చేశారని ఆరోపణలతో తహసిల్దార్, ఇద్దరు ఆర్ ఐ లను సస్పెండ్ చేయడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే కొత్త ఆర్ ఐ ను నియామకం చేసి ప్రజల సమస్యలను పరిష్కారం చేయాలని మండలప్రజలు కోరుకుంటున్నారు.