calender_icon.png 5 May, 2025 | 7:26 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పాలిచ్చే చెట్లు

20-04-2025 12:00:00 AM

ఈ చెట్లకు ఎక్కడ గాటు పెట్టినా పాలు కారుతాయి. 25-30 మీటర్ల ఎత్తు ఉండే వీటి నుంచి తీసే పాలు పశువుల నుంచి లభించే పాల లాగే తోడు పెడితే గడ్డ కడతాయి. ఈ పాల చెట్లను సాగు చేస్తున్న రైతులు ఎకరానికి లక్ష రూపాయలకు పైగా ఆదాయాన్ని పొందుతున్నారు. ఆ విశేషాలు తెలుసుకుందామా..

ఈ చెట్ల నుంచి పాలు తీయడం చాలా కష్టమైన పని. చెట్టు బెరడును కాస్త మధ్యస్తంగా చెక్కుతారు. చెట్టు దెబ్బ తినకుండా సరైన లోతు వరకూ బెరడును తొలగించడానికి చాలా నైపుణ్యం కావాలి. దీని కోసం జబాంగ్ అనే ప్రత్యేకమైన వంపు తిరిగిన కత్తిని వాడుతారు. చెట్టు మొదళ్లకు అమర్చిన చిన్న కప్పుల్లోకి పాలు చుక్కలుగా కారుతుంటాయి. రెండు గంటల తర్వాత  పాలన్నీ బకెట్లలోకి తీసుకుని, వాటిని వడగట్టి మలినాలను తీసేస్తారు. 

రబ్బరు బ్రెజిల్ దేశపు పంట. మనదేశంలో ఈ పంటకు కేరళ, తమిళనాడులో వాణిజ్యపరంగా 1902 నుంచి సాగు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని మండలాలు సముద్రమట్టానికి ఎత్తులో ఉండటం వల్ల చల్లని వాతావరణం రబ్బరు సాగుకు అనుకూలంగా ఉంటుంది.

ఇక్కడి దేవరపల్లి గ్రామం రబ్బరు సాగుకు అనుకూలం అని 1994లో గుర్తించిన రబ్బరు బోర్డు 35 గిరిజన కుటుంబాలతో 50 హెక్టార్లలో రబ్బరు మొక్కలు నాటించింది. అనుకూల ఫలితాలు రావడంతో 10 వేల ఎకరాల విస్తీర్ణంలో మొక్కలు నాటారు కాని, ప్రస్తుతం 478.67 హెక్టర్లలో రబ్బరు దిగుబడి ఉన్నది.

ఈ ప్రాంతంలో తీసే సహజ రబ్బరులో 70 శాతం టైర్ల తయారీకి ఉపయోగిస్తున్నారు. రబ్బరు పాలకు అమ్మోనియా వాయువు కలిపి కొన్ని సంవత్సరాల వరకు నిలువ ఉంచవచ్చు. ఈ పాలను చేతి తొడుగులు,  రబ్బరు బ్యాండ్ల తయారీలో వాడుతారు. రబ్బరు షీట్లను చెప్పుల పరిశ్రమల్లో ఉపయోగిస్తారు.