3 July, 2026 | 10:40 PM

Breaking News

పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నారని విద్యార్థి సంఘాల ఆందోళన   •   ఉప సర్పంచ్ కవిత కుటుంబానికి అండగా ఉంటాం   •   చివ్వెంల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా దారావత్ వీరన్న నాయక్   •   డీఏపీ ఎరువుల ధరలు ఎమ్మార్పి ధరకు ఇవ్వాలి   •   ఎర్రుపాలెం శివాలయంలో శృంగేరి శారద పీఠాధిపతి ప్రత్యేక పూజలు   •   ఘనంగా ఇండియన్ క్రిస్టియన్ డే   •   ఇంటింటికీ ఎన్యుమరేషన్ ఫారమ్‌ల పంపిణీ కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన ఈఆర్‌వో శ్రీనివాస్ రెడ్డి   •   నివాళులర్పిస్తున్న జిల్లా అధ్యక్షుడు మెతుకు సత్యం   •   మహిళా సాధికారతే మోదీ లక్ష్యం   •   రామన్నపేటలో కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ   •  

మూసీ పేరుపై లక్షకోట్ల అవినీతికి ప్లాన్

05-10-2024 01:16 AM

ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 

హైదరాబాద్, అక్టోబర్ 4 (విజయక్రాంతి): మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేయాలని కాంగ్రెస్ సర్కార్ భావిస్తోందని బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్‌ఎస్ పాలనలో కేసీఆర్ మూసీ సుందరీకరణ కోసం రూ.16 వేల కోట్లు ప్రతిపాదించారని రూ.3800 కోట్లతో స్పెషల్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు, అందమైన బ్రిడ్జిలను నిర్మించినట్లు తెలిపారు.

శుక్రవారం తెలంగాణ భవన్‌లో చిరుమళ్ల రాకేశ్‌కుమార్, తుంగబాలుతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడారు. మాజీ మంత్రులు హరీశ్‌రావు, కేటీఆర్ పట్ల సీఎం నోటికొచ్చినట్లు మాట్లాడటం భావ్యం కాదన్నారు. కాంగ్రెస్ పాలనపై ప్రజలు విసుగెత్తారన్నారు.