calender_icon.png 25 August, 2025 | 9:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లలితమ్మా.. ఇదేంటమ్మా?

25-08-2025 01:17:04 AM

- ఏసీబీకి చిక్కిన ఆమనగల్లు తహసీల్దార్

- నిషేధిత జాబితాలో భూమి ఉంటే ఆమెకు పండగే 

- ఫైలు కదలాలంటే పైకం ముట్టజెప్పాల్సిందే

- ఆమెకు బినామీగా మీ సేవ నిర్వాకుడు

- ధరణి ఆపరేటర్ పై ఆరోపణలు

- గతంలోనే ఏసీబీకి ట్రాప్ అయిన తహసీల్దార్ చందర్ రావు

- తహసీల్దార్ ఆఫీసుకు అవినీతి మచ్చ

- పాత్రధారులు..సూత్రధారులెవరు?

 ఆమనగల్లు, ఆగస్టు : రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు తహసీల్దార్ లలిత అవినీతి ఆరోపణలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. పట్టాదారు పాస్ పుస్తకంలో జెండర్ కరెక్షన్ విషయంలో లంచం డిమాండ్ చేసిన తాసిల్దార్‌పై బాధితులు ఏసీబీ కి ఫిర్యాదు చే యడంతో తహసీల్దార్ లలితను ట్రాప్‌చేసి సూత్రధారులను పట్టుకున్నారని కానీ.. అసలైన పాత్రధారుల సంగతేమిటని ఆమనగ న్లుతహసీల్దార్ కార్యాలయంలో గుస గూస లు వినిపిస్తున్నాయి.

అసలైన పాత్రధారులు తహసీల్దార్ ఆఫీసులో పనిచేసే ధరణి కం ప్యూటర్ ఆపరేటర్, మీసేవ సెంటర్ నిర్వహించే నిర్వాహకుడి పై పెద్ద ఎత్తున విమ ర్శలొస్తున్నాయి. ఆమనగల్లు తహసీల్దార్ ఆఫీసు అవినీతి మయంగా మార్చిందే ఈ ఇద్దరే అని స్థానికులు మండిపడుతున్నారు. వీ రి ప్రోత్సహంతో నే తహసీల్దార్ లలిత, రె వెన్యూ అధికారులు అవినీతికి పాల్పడుతున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఆన్‌లైన్‌ద్వారా లావాదేవీలు చేస్తే వీరి అవినీ తి భాగోతం బయటపడుతుందని.. నగదు రూపంలో తీసుకుంటారని స్థానికులు విమర్శలు గుప్పించారు.

వీరే డీల్ చేసి బాధితుల నుంచి తీసుకునే పైసలన్నీ తాసిల్దారు కు ఆన్లై న్ ద్వారానే పెద్ద మొత్తంలో ట్రాన్సాక్షన్ జరిపేవారని అందుకూ వీరి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తే ఇట్టే అర్థమవుతుందన్నారు.ఆమనగల్లు తహసీల్దార్ ఆఫీసులో పనిచేస్తూ అవి నీతికి పాల్పడుతున్నా అధికారులు, సిబ్బం ది, ప్రైవేట్ వ్యక్తుల కు గుణపాఠం చెప్పాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై ఉన్నతాధి కారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వెచి చూడలని మరి!

తెర వెనుక పాత్ర ఎవరిది?..

ఆమనగల్లు తహసీల్దార్ కార్యాలయంలో పూర్తిగా అవినీతిమయం కావడంలో తెర వెనుక ఓ మీసేవ నిర్వాహకుడు, ధరణి ఆపరేటర్ కీరోలుగా మొత్తం వ్యవహారం నడిపి స్తున్నారని... స్థానికుల నుంచి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. అవినీతి కేసులో పట్టుబడిన తాసిల్దార్ లలిత విషయంలో వీరిదే ప్రధాన పాత్ర అని.... కార్యాలయంలో కి వివిధ పనుల నిమిత్తం వచ్చిన వారిని ప నులు కావాలంటే పైసలు ఇవ్వాల్సిందే అంటూ... పలువురు బాధితులను వీరు బెదిరింపులకు గురి చేసే వారని వీరి పై నే ఆరో పణలు కోకొల్లలు.

భూముల క్రయవిక్రయాల సంబంధించి స్లాట్ బుకింగ్ నుంచి మొదలుకొని భూముల రిజిస్ట్రేషన్ వరకు తామే అంతా చూసుకుంటామంటూ వచ్చిన రైతుల నుంచి భూముల క్రయవిక్రయాలు జరిపి వారికి వీరే మధ్యవర్తిగా ఉంటారు. ప ట్టాదారు పాసు పుస్తకాల్లో తప్పొప్పులు దొర్లిన, గతంలో అధికారుల తప్పుల కారణంగా భూముల నిషేధిత జాబితాలోకి వెళ్లి న అట్టి భూముల సవరణలు కు సంబంధించిన ఫైల్స్ వస్తే వీరికి పండుగ.

నిషేధిత జా బితా భూములను.... నిబంధనల ప్రకారము సరిచేయాల్సి ఉన్న మార్కెట్లో అట్టి భూ ముల విలువలను లెక్క కడుతూ మండల పరిధి లో భూమి ఉంటే ఎకరం కు రూ. 1 లక్ష, గ్రామాలలో ఉంటే 50,000 చొప్పున పర్సంటేజీల మాదిరిగా రైతుల నుంచి ము క్కుపిండి... మరి వసూలు చేసి తాసిల్దార్ కు వీరే మధ్యవర్తిగా ఉంటారని వీరిపైన కొంతకాలంగా విమర్శలు ఉన్నాయి. తహసీల్దార్ కార్యాలయంలో ఉండే భూ రికార్డులు సైతం మీసేవ కార్యాలయంలో ప్రత్యక్షమయ్యేదని మీసేవ నిర్వాహకుడు, ధరణి ఆపరేటర్ ఇద్ద రూ స్థానిక తహసీల్దార్ ద్వారా భూముల రిజిస్ట్రేషన్ లో వీరే కీలక పాత్ర పోషించేవారని  కార్యాలయంలో పలువురు సిబ్బంది సై తం వీరిపై ఆరోపణలు గుప్పించారు. తమపై అధికారులు ఉన్నాయనే తాము సైతం తమ పనులు తాము చేసుకుంటూ వెళ్లేవారు అని సహా ఉద్యోగులు తమ గోడును వెల్లబోసుకున్నారు.

ఒక్కొక్కటిగా లీలలు..

ఆమనగల్లు తహసీల్దార్ లలిత లీలలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఇక్కడ తాసిల్దారుగా విధులు ప్రారంభించిన నాటి నుంచి అవినీతి అక్రమాలను ప్రోత్సహించేదనే ఆమె పై ప్రధాన ఆరోపణ ఉంది. స్థానిక ధ్రువపత్రం మొదలుకుని బర్త్ సర్టిఫికెట్, కుల ఆదాయం, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, ఇలా ఏ ధ్రువీకరణ పత్రం పొందాలన్నా పైసల్ ముట్టాల్సిందే. రంగారెడ్డి జిల్లా లో హైదరాబాద్ -శ్రీశైలం ప్రధాన రహదారిపై ఉన్న భూములకు విలువ పెరగడంతో పలువురు రియల్ వ్యాపారులు ఇక్కడ భూములకు క్రయవిక్రయాలు సాగిస్తూ ఉం టారు.

ఈ క్రమంలో భూముల పాస్ పుస్తకాలు ఏమైనా చిన్నపాటి తప్పులు దొర్లిన, సర్వేనెంబర్, జెండర్ సరిదిద్దులు, నిషేధిత జాబితా, అసైన్డ్ పట్టా భూములు పలు మిస్టే క్లు, కోర్టు కేసులు ఇలా, లిటిగేషన్ భూ ములు ఉంటే వీరికి పంట పండినట్లేనని అని విమర్శలు వస్తున్నాయి. 

ఇటీవలనే మండలంలో ఒక నిషేధిత జాబితాలో ఉన్న భూమి లోకి రికార్డు సరి చేయడంలో పెద్ద ఎత్తున తాసిల్దార్ కు డబ్బులు ముట్టాయని ఆరోపణలు ఉన్నాయి. ధరణి ఆపరేటర్ గతంలో పనిచేసిన తాహసీల్దారుకు మధ్య లావాదేవీలో సైతం మధ్యవర్తిగా ఉండి లావాదేవీలు చేసారనే ఆరోపణలు ఉన్నాయి. 

భూమి రికార్డు విషయంలో బాధితుడు నుంచి పది లక్షల పైగా డబ్బులు వసూలు చేసి గతంలో పనిచేసిన తాసిల్దార్ కు రూ. 5 లక్షలు మాత్రమే ఇవ్వడం తో బాధితుని ద్వారా టి విషయం తెలుసుకొన్న సదరు తాసిల్దారు సైతం ధరణి ఆపరేటర్ పై చిందులు వేసిందని ప్రచారం సాగింది. ఇలా తాసిల్దార్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్, కాంటాక్ట్ ఉద్యోగాల్లో ఉన్న సిబ్బంది అవినీతి అక్రమాలకు తెరలేపుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా ఉన్నతాధికారులు అమన గల్లు తాసిల్దార్ కార్యాలయంలో దృష్టి సారించి అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.