6 June, 2026 | 2:35 AM

డీఈఓగా లలిత బాధ్యతల స్వీకరణ

06-06-2026 12:29 AM

మంచిర్యాల టౌన్, జూన్ 5 : మంచిర్యాల జిల్లా విద్యా శాఖాధికారి (డీఈవో)గా  ఎల్ లలిత శుక్ర వారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ డిఈవోగా పనిచేసిన ఎస్ యాదయ్య హైదరాబాద్ డీఈవోగా బదిలీపై వెళ్లగా మంచిర్యాల జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో ఏడిగా పనిచేసి కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారిగా విధులు నిర్వహిస్తున్న లలితను  మంచిర్యాల జిల్లా విద్యాధికారిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ సందర్భంగా డి ఈ ఓ మాట్లాడుతూ ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపునకు కృషి చేస్తానని, జిల్లా, రాష్ట్ర అధికారుల సహకారంతో మౌలిక వసతులను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తాననీ, ఎన్‌ఏఎస్, పీజీఐలలో జిల్లా ర్యాంకు మరింత మెరుగుపడేలా సాయ శక్తులా ప్రయత్నిస్తానని పేర్కొన్నారు.