నిజాయితీకి నిలువుటద్దం ఎల్లన్న
- మాజీ మంత్రి హరీశ్ రావు
- తెల్లాపూర్ ‘ఎల్లయ్య ఎన్‌క్లేవ్‌లో ఎల్లన్న విగ్రహం ఆవిష్కరణ
రామచంద్రాపురం, జూన్ 5 :కార్మిక నా యకుడు, శ్రమశక్తి అవార్డు గ్రహీత, తెలం గాణ ఉద్యమకారుడు స్వర్గీయ జి.ఎల్లన్న 85వ జయంతి ఉత్సవాలు తెల్లాపూర్లోని ఎల్లయ్య ఎన్క్లేవ్లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు ముఖ్య అతిథిగా హాజరై ఎల్లన్న విగ్రహాన్ని ఆవిష్క రించారు. ఈ సభలో పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్ రెడ్డి, ఎల్లన్న కుమారుడు విజయ్ ప్రతాప్, స్థానిక బీఆర్‌ఎస్ నాయకులు, కా ర్మిక సంఘాల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ ఎల్లన్న కేవలం ఒక కార్మిక నా యకుడిగానే కాకుండా, చివరి శ్వాస వరకు కార్మికుల తరపున నిలిచిన గొప్ప తెలంగాణ ఉద్యమ యోధుడని కొనియాడారు. బీహెచ్‌ఈఎల్ ప్రాంతంలో ఎల్లన్న పేరు తెలియని వారు, ఆయన సేవలు అందుకోని వారు ఎవరూ లేరన్నారు. కాగా ఎల్లయ్య 12 అడుగుల భారీ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని కోరారు. రాబోయే రెండు నెలల్లో రానున్న ఎల్లన్న వర్ధంతి నాటికల్లా ఎల్‌ఐజీ సర్కిల్లో గానీ, తగిన స్థలంలో గానీ 12 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించే బాధ్యతను ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డికి అప్పగిస్తున్నట్లు హరీశ్ రావు ప్రకటించారు






