లలితా జ్యువెలరీ ఐపీవో ఘనమైన అరంగేట్రం
- 32 శాతం ప్రీమియంతో లిస్టింగ్.. 62.97 రెట్లు సబ్‌స్ర్కైబ్
- లాభాలను ఆర్జించిన కొనుగోలుదారులు
- వెయ్యికోట్లతో 12 కొత్త రిటైల్ స్టోర్లకు ప్రణాళిక
హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి) : ప్రముఖ రిటైల్ సంస్థ లలితా జ్యువెలరీ మార్ట్(Lalita Jewellery Mart) షేర్లు స్టాక్ మార్కెట్(Shares Stock Market)లో ఘనంగా అరంగేట్రం చేసింది. ఆగస్టు 24, 2026న బీఎస్‌ఈలో కంపెనీ షేర్లు రూ.265.30 వద్ద లిస్ట్ అయ్యాయి. ఐపీఓ గరిష్ఠ ధర రూ.201తో పోలిస్తే ఇది సుమారు 32 శాతం ప్రీమియం కావడం విశేషం. కంపెనీ ఒక్కో షేరుకు రూ.190 నుంచి రూ.201 వరకు ధరల శ్రేణిని నిర్ణయించింది. మొత్తం రూ.1,700 కోట్ల విలువైన ఐపీఓకు ఇన్వెస్టర్ల నుంచి భారీ స్పందన లభించింది.
ఈ ఐపీఓ సుమారు 62.97 రెట్లు సబ్‌స్ర్కైబ్ అయింది. ఐపీవోలో రూ. 1,200 కోట్ల విలువైన తాజా షేర్లు జారీ చేయగా, రూ.500 కోట్ల విలువైన షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించారు. సమీకరించిన నిధులను కంపెనీ వ్యాపార విస్తరణకు వినియోగించనున్నారు. సమీకరించిన నిధుల్లో రూ. 1,000 కోట్లతో 12 కొత్త రిటైల్ స్టోర్ల ఏర్పాటుకు వినియోగించాలని సంస్థ నిర్ణయించింది. కొత్త స్టోర్ల ద్వారా మరిన్ని ప్రాంతాల్లో తమ రిటైల్ నెట్‌వర్క్‌ను విస్తరించనుంది.
ఐపీవో ధర రూ. 201 కాగా బీఎస్‌ఈలో రూ. 265.30 వద్ద షేర్లు లిస్ట్ కావడంతో షేర్లు కొనుగోలు చేసిన వారు మంచి లాభాలను ఆర్జించారు. కాగా లిస్టింగ్ లాభాల ఆధారంగా భవిష్యత్ పనితీరును అంచనా వేయలేమని సంస్థ ఆర్థిక ఫలితాలు, బంగారం ధరల మార్పులు, వినియో గదారుల డిమాండ్, కొత్త స్టోర్ల పనితీరు, మార్కెట్ పరిస్థితులు తదితర అంశాలు భవిష్యత్‌లో షేర్ ధరపై ప్రభావం చూపే అవ కాశం ఉంది.






