6 September, 2026 | 11:58 AM

సదరన్‌కు బెస్ట్ టూరిజం అవార్డు

31-08-2026 | 12:00am
  1. రెండోసారి అవార్డు.. గర్వకారణం: ఎండీ కృష్ణమోహన్
  2. నాణ్యమైన, విశ్వసనీయ సేవలే లక్ష్యం
  3.    56 ఏళ్ల ప్రయాణం, 45 లక్షలమందికి సేవలు
  4. ప్రస్తుతం 2500కు పైగా టూర్ ప్యాకేజీలు

హైదరాబాద్, ఆగస్టు 30 (విజయక్రాంతి): వినూత్న ఆలోచనలతో వినియోగదారులు మెచ్చే విధంగా సేవలందించడంతో భారతదేశంలోనే ప్రముఖ విశ్వసనీయ ట్రావెల్ సంస్థగా నిలవడం ఎంతో గర్వకారణమని సదరన్ ట్రావెల్స్ మేనేజింగ్ డైరెక్టర్ కృష్ణమోహన్(MD Krishnamohan) అన్నారు. ప్రతిష్ఠాత్మకమైన ‘గ్లోబల్ టూరిజం అవార్డ్(Global Tourism Award)-2026 బెస్ట్ డొమె స్టిక్ టూర్ ఆపరేటర్(Best Domestic Tour Operator.)’ అవార్డును రెండోసారి అందుకున్నామని ఆదివారం సంస్థ ఎండీ కృష్ణమోహన్ మీడియాకు వివరించారు.

వినియోగదారులు ఉంచిన నమ్మకానికి లభించి న గుర్తింపు అని హర్షం వ్యక్తం చేశారు. దేశ పర్యాటక రంగ అభివృద్ధికి మరింత కృషి చేసేందుకు ఈ అవార్డు తమకు ఎంతో స్ఫూ ర్తినిస్తుందన్నారు. 56 సంవత్సరాల సుధీర్ఘ ప్రయాణంలో 45 లక్షలకు పైగా కస్టమర్లకు సదరన్ ట్రావెల్స్ దేశీయ,

అంతర్జాతీయ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చిందని వా రి జీవితాల్లో మరపురాని పర్యాటక ప్రదేశాల అనుభవాలను అందించిందని అన్నారు. ప్ర స్తుతం సంస్థ 2500కు పైగా టూర్ ప్యాకేజీలను అందిస్తుందని చెప్పారు. 1970లో స్థా పించి అంచలంచెలుగా ఎదుగుతూ నేడు కార్పొరేట్ తరహాలో వృద్ధి చెందడంపై సంస్థ ఎండీ కృష్ణమోహన్ హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు