25-05-2025 06:11:30 PM
బీహార్,(విజయక్రాంతి): ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆర్జేడీ పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్‌ను బహిష్కరించినట్లు లాలూ ప్రసాద్ ఆదివారం తెలిపారు. తేజ్ ప్రతాప్ యాదవ్ బాధ్యతారహితంగా ప్రవర్తించినందుకు ఆరు ఏళ్ల పాటు పార్టీ నుండి బహిష్కరించి, అతనితో ఉన్న అన్ని కుటుంబ సంబంధాలను కూడా తెంచుకున్నట్లు ఇవాళ మధ్యాహ్నం ఎక్స్ లో ప్రకటన చేశారు.
పెద్ద కొడుకు కార్యకలాపాలు, ప్రజా ప్రవర్తన, బాధ్యతారహిత ప్రవర్తన మా కుటుంబ విలువలు, సంప్రదాయాలకు సరిపోవడం లేదన్నారు. తాను అతన్ని పార్టీతో పాటు కుటుంబం నుండి తొలగిస్తున్నాట్లు తెలిపారు. ఇకపై తేజ్ ప్రతాప్ కు పార్టీ, కుటుంబంలో ఎలాంటి పాత్ర ఉండదని ప్రసాద్ వెల్లడించారు. ప్రతాప్ యాదవ్ ఒక యువతితో సంబంధంలో ఉన్నానని ఫేస్‌బుక్ పోస్ట్‌లో చెప్పిన ఒక రోజు తర్వాత ఈ చర్య వచ్చింది. కానీ తరువాత సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన ఖాతా హ్యాక్ చేయబడిందని వివరణ ఇచ్చారు.