16 March, 2026 | 4:21 AM

ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి ధర్నా

16-03-2026 01:40 AM

బంధువులతో కలిసి వంటా వార్పు

చేగుంట, మార్చి 15: పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసిన ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలు ధర్నాకు దిగింది. ఈ ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామంలో ఆదివారం జరిగింది. చేగుంట మండలం పెద్ద శివనూర్ గ్రామానికి చెందిన ముదాం వినయ్ (23), అదే గ్రామానికి చెందిన యువతి ప్రేమించుకున్నారు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించిన వినయ్.. గత కొన్నేళ్లుగా ఆమెతో సహజీవనం చేశాడు. పెళ్లి చేసుకోవాలని ప్రియురాలు ఒత్తిడి తేవడంతో పెళ్లికి నిరాకరించా డు. దీంతో కుటుంబ సభ్యులు, కులస్తుల ఆధ్వర్యంలో ప్రియు డి ఇంటి ముందు ధర్నా, వంటా మార్పు చేశారు. చేగుంట ఎస్సై చైతన్య కుమార్‌రెడ్డి గ్రా మానికి చేరుకొని ఇరు కుటుంబాలను చేగుంట పోలీస్ స్టేష న్‌కు తీసుకెళ్లారు.