calender_icon.png 25 May, 2025 | 11:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బాంబులతో దద్దరిల్లిన ఉక్రెయిన్ రాజధాని కీవ్

25-05-2025 06:46:31 PM

ఉక్రెయిన్,(విజయక్రాంతి): ఉక్రెయిన్ పై డ్రోన్లు, క్షిపణులతో రష్యా విరుచుకుపడింది. రష్యా దాడిలో ఉక్రెయిన్ లో 12 మంది మృతి చెందగా, 70 మందికి పైగా గాయపడ్డారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ వైమానిక దళ ప్రతినిధి యూరీ ఇగ్నాత్(Ukrainian Air Force spokesman Yuriy Ignat) మాట్లాడుతూ... ఉక్రెయిన్ లో 80 నివాస భవనాలు ధ్వంసం కాగా, 27 చోట్ల అగ్నిప్రమాదాలు జరిగాయిన, ఉక్రెయిన్ రాజధాని కీవ్ బాంబ్ మోతలతో దద్దరిల్లిందని పేర్కొన్నారు. రష్యా తమపై మొత్తం 367 క్షిపణులు, 298 డ్రోన్లు ప్రయోగించిందని వెల్లడించారు. 2022లో పూర్తిస్థాయి యుద్ధంలో ఇదే అతిపెద్ద వైమానిక దాడిగా ఆయన స్పష్టం చేశారు.

కీవ్ నగరంలోనే నలుగురు మృతి చెందగా, 16 మంది గాయపడ్డారని, డ్రోన్ శకలాలు పడి నివాస భవనాలు దెబ్బతిన్నాయి. ఉక్రెయిన్ లో ఈ ఆదివారం ఉదయం ఒక కష్టతరమైందని విదేశాంగ మంత్రి ఆండ్రీ సిబిహా(Foreign Minister Andrii Sybiha) సోషల్ మీడియా ప్లాట్ ఫాం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అలాగే జైటోమిర్ ప్రాంతంలో 8,12,17 ఏళ్ల ముగ్గురు చిన్నారులు మరణించారని, ఖ్మెల్నిట్స్కీలో నలుగురు, మైకోలైవ్ లో ఒకరు మరణించినట్లు ఆయన వెల్లడించారు. రష్యా చర్యలపై ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ(Ukrainian President Volodymyr Zelensky) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రష్యా ఉద్దేశపూర్వకంగానే సాధారణ నగరాలపై దాడులు చేస్తోందని ఆరోపించారు.