calender_icon.png 30 September, 2025 | 11:18 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

లంబాడీల ఆత్మగౌరవ సభ వాయిదా

30-09-2025 09:33:17 PM

మోతె (విజయక్రాంతి): లంబాడిల ఆత్మ గౌరవ సభను వాయిదా వేస్తున్నట్లు తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక మండల సమన్వయకర్తలు లక్ష్మణ్ నాయక్, సురేష్ నాయక్, మణికంఠ నాయక్ తెలిపారు. మంగళవారం మండల కేంద్రంలోని విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో సోమవారం మోతె మండలంలో జరగాల్సిన లంబాడీల ఆత్మగౌరవ సభను ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడం వలన తాత్కాలికంగా వాయిదా వేయడం జరిగిందని సమన్వయకర్తలు గుగులోతు సురేష్, నాయక్ గుగులోతు లక్ష్మణ్ నాయక్, కోర్ర మణికంఠ నాయక్ లు తెలిపారు. మండల కేంద్రంలో జరిగే సభ తేదీని ప్రకటించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో బి. నగేష్ నాయక్, రాకేష్ నాయక్, బి. మహేష్ నాయక్, బి.నిరంజన్ నాయక్, బి చరణ్ నాయక్, బి.ధనుష్ నాయక్, బి.గోపినాయక్, డి. హరిప్రసాద్ నాయక్, హెచ్ హరిప్రసాద్ నాయక్, జీ.అఖిల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.