calender_icon.png 30 September, 2025 | 11:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఎస్టీ రిజర్వేషన్ వచ్చేదాకా న్యాయ పోరాటం ఆగదు

30-09-2025 09:36:49 PM

ఒక్క బీసీ కూడా లేని గిరిజన తండాకు బీసీ రిజర్వేషన్ దేనికి..

గిరిజనుల హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వం..

భైంసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ కు ఫకీర్ నాయక్ గిరిజన తండా వాసుల వినతి.. 

కుభీర్ (విజయక్రాంతి): తమ గ్రామానికి ఎస్టీ రిజర్వేషన్ కల్పించే వరకు ప్రభుత్వంపై న్యాయపోరాటం చేస్తామని నిర్మల్ జిల్లా కుబీర్ మండలంలోని ఫకీర్ నాయక్ గిరిజన తండా నాయకులు, మాజీ సర్పంచులు గోపీచంద్ జాదవ్, పండిత్ జాదవ్ పేర్కొన్నారు. మంగళవారం వారు పైసా లోని సబ్ కలెక్టర్ అజ్మీర సంకేత్ కుమార్ ను కలిసి తమ గిరిజన తండాలో 1400 వరకు జనాభా ఉంది. అందులో ఏ ఒక్కరు కూడా బీసీలు లేకపోయినప్పటికీ బీసీ రిజర్వేషన్ కల్పించడం పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే జరిగిన పొరపాటును సవరించి తమకు న్యాయం చేసి ఎస్టీ రిజర్వేషన్ను కల్పించాలని కోరుతూ వినతి పత్రాన్ని అందించారు.