calender_icon.png 10 August, 2025 | 1:23 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భూభారతి అర్జీలను సత్వరం పరిష్కరించాలి

07-08-2025 12:47:27 AM

కలెక్టర్ బి.యం.సంతోష్

గద్వాల, ఆగస్టు 06 : రాష్ట్ర ప్రభుత్వం ప్ర తిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న భూభారతి కార్యక్రమంలో వచ్చిన ఆర్జీలను సత్వరం పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తహసీల్దార్లను ఆదేశించారు. బుధవారం జి ల్లా కలెక్టర్ కార్యాలయ కాన్ఫరెన్స్ హాలులో భూభారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై ఒక్కో మండలం వారీగా తహసిల్దార్ల తో సమీక్ష సమావేశం నిర్వహించా రు.

వచ్చిన దరఖాస్తులలో ఆయా మా డ్యుల్స్ లో ఎన్ని అర్జీలు పరిష్కరించారు, ఎన్ని పెండింగ్ లో ఉన్నాయి,ఎంత మందికి నోటీసులు ఇచ్చారు,క్షేత్రస్థాయి పరిశీలన ప్ర క్రియ పూర్తయ్యిందా తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. దరఖాస్తుల పరిష్కారంలో జాప్యం జరుగుతున్న మండలాల త హసీల్దార్లను, జాప్యానికి గల కారణాలు ఏ మిటని ప్రశ్నించారు. భూ భారతి రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులపై క్షేత్రస్థా యి పరిశీలన నిర్వహించి, ఆన్లైన్లో నమోదు చేసినవన్నీ తక్షణమే డిస్పోజ్ చేయాలని ఆదేశించారు.

సక్సేషన్, పెండింగ్ మ్యుటేషన్, పిఓపి, డి.ఎస్. లాంటి అన్ని పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకు ని,పూర్తి స్థాయిలో పరిష్కరించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. దరఖాస్తుల తిరస్కరణను స్పష్టమైన కారణాలతో రికార్డు చేయాలని అన్నారు.అసైన్మెంట్ భూముల సమస్యలను పూర్తిగా పరిశీలించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేసి, నివేదికను సమర్పించాలని అన్నారు.

వచ్చేవారం చేపట్టిన చర్యలపై తిరిగి సమీక్షించడం జరుగుతుందని  తెలిపారు. మీసేవ ద్వారా 2024 సంవ త్సరం వరకు దరఖాస్తు చేసిన వివిధ సర్టిఫికెట్లు పెండింగ్లో ఉంచకుండా  ఒక వారం లోపల పరిష్కరించాలని అన్నారు. జిల్లాలో పెండింగ్లో ఉన్న రేషన్ కార్డుల దరఖాస్తులలో చాలా వరకు పరిష్కరించగా,

మిగిలినవి కూడా తక్షణమే పూర్తి చేసి, కొత్త రేషన్ కా ర్డుల మంజూరు, సభ్యుల చేర్పులు,తొలగింపులు వంటి అంశాలను త్వరితగతిన పరిశీ లించి పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) లక్ష్మీనారాయణ,  ఆర్.డి. ఓ. అలివేలు,సర్వే అండ్ ల్యాండ్ రికార్డు ఏడీ రామ్ చందర్, తహశీల్దార్లు,పాల్గొన్నారు.