calender_icon.png 7 August, 2025 | 7:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాంస్కృతిక ప్రతిభకు జాతీయ గుర్తింపు

07-08-2025 12:46:56 AM

బూర్గంపాడు, ఆగస్టు 6,(విజయక్రాంతి):జాతీయ స్థాయిలో అమలవుతున్న నూతన జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా, రాజస్థాన్ రాష్ట్రంలోని ఉదయ్పూర్లోని సీసీఆర్టీ (సెంటర్ ఫర్ కల్చరల్ రిసోర్సెస్ అండ్ ట్రైనింగ్) కేంద్రంలో నిర్వహించిన 21 రోజుల జాతీయ ఉపాధ్యాయ శిక్షణా శిబిరంలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన బెస్ట్ ప్రాక్టీస్ ఉపాధ్యాయ బృందం ప్ర త్యేకంగా నిలిచారు.ఈ శిక్షణలో వారు తెలంగాణ సాంస్కృతిక సంపదలైన బతుకమ్మ, బోనాలు, తీజ్, సమ్మక్క సారలమ్మ జాతర వంటి పండుగలు కండ్లకు కట్టినట్లు ప్రదర్శించడంతో పాటు జయ జయహే తెలంగాణ అంటూ రాష్ట్ర గీతాన్ని ఆలపిస్తూ ఇతర రాష్ట్రాల ఉపాధ్యాయులను ఉ త్సాహపరిచారు.

అన్ని రాష్ట్రాల ఉపాధ్యాయులు తెలంగాణ గీతాన్ని జతగా ఆలపించడం గర్వకారణంగా నిలిచింది. ఎఫ్ ఎల్ ఎన్, నిపున్ భారత్, నిస్తా,లిప్ వంటి విద్యా అంశాలపై అవగాహన పెంపొందించడమే కాక, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, స్వచ్ఛ భారత్, విలువ విద్య, విద్యలో సాంస్కృతిక సమన్వయంపై పలు మాడ్యూల్స్,ఐసీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీనీ శిక్షణలో భాగంగా చేసి చూపించడం జరిగింది. పేపర్ మశీ, టెర్రకోట శిల్పకళ, చిత్రకళ,బంధిని డిజైన్లు, పప్పెట్ షోలు, చిత్రకళా ప్రదర్శనలు, సంగీతం-నాట్యంవంటి కళారూపాలను విద్యా సాధనంగా ఎలా ఉపయోగించాలో అనుభవాత్మకంగా నేర్చుకున్నారు.

అలాగే శిల్పగ్రామ్, చిత్తోడ్ ఘడ్ కోట,సిటీ ప్యాలెస్, హల్దీ ఘాటి, సాస్ బహు దేవాలయం, ఏకలింగేశ్వర ఆలయం వంటి చారిత్రక ప్రదేశాలను, విద్యా సంస్థలను సందర్శించి రాజస్థాన్ లో అమలవుతున్న విద్యా విధానంను పరిశీలించారు. ఈ శిక్షణలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలానికి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోరంపల్లి బంజర లోని ఉపాధ్యాయుడు మోహన్ తన బెస్ట్ ప్రాక్టీస్ను పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు.

ఆయనతో పాటు ఉమా మహేశ్వరరావు,ఓదెలు,పవిత్ర, శంకర్,మహమ్మద్ షఫీ,ఇర్షాద్ అలీ, ఆచరిత,సీతల్ ఉత్తమ ప్రతిభను ప్రదర్శించారు. తెలంగాణ సత్తాను జాతీయ స్థాయిలో గళం వినిపించడం జరిగింది. సీసీఆర్టీ ఉదయపూర్ ఫీల్ ఆఫీసర్ అభిజిత్ సర్కార్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ముగింపు సమావేశంలో సీసీఆర్టీ ఛైర్మన్ డా.వినోద్ నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ డా. రాహుల్ కుమార్,సీసీఆర్టీ న్యూ ఢిల్లీ ఫీల్ ఆఫీసర్ చంద్రమౌళి శిక్షణ విజయవంతంగా పూర్తి చేసిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్లు అందజేశారు.